News July 31, 2024
సీఐడీ మాజీ చీఫ్ సంజయ్, పొన్నవోలుకు హైకోర్టు నోటీసులు

AP: సీఐడీ మాజీ చీఫ్ సంజయ్, మాజీ అదనపు AG పొన్నవోలు సుధాకర్ రెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. YCP హయాంలో చంద్రబాబుపై నమోదైన స్కిల్ కేసు దర్యాప్తులో ఉండగానే వీరు మీడియా సమావేశం నిర్వహించారని హైకోర్టులో పిల్ దాఖలైంది. ప్రెస్‌మీట్ పెట్టి ప్రజాధనం దుర్వినియోగం చేశారని పిటిషనర్ సత్యనారాయణ పేర్కొన్నారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన కోర్టు విచారణను SEP 9కి వాయిదా వేసింది.
Similar News
News April 4, 2026
అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. ప్రధానికి బాధితుల లేఖ

గతేడాది అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబసభ్యులు 30 మంది ప్రధాని మోదీకి లేఖ రాశారు. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్, బ్లాక్ బాక్స్ ఫ్లైట్ డేటా రికార్డర్ డేటాను విడుదల చేయాలని కోరారు. బహిరంగంగా కుదరకపోతే తమకైనా ఆ వివరాలు ఇవ్వాలన్నారు. విమానం ఎందుకు కూలిందో తాము తెలుసుకోవాలనుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఫ్లైట్‌లోని 242 మందికి గాను 241 మంది, 19 మంది ఇతరులు మరణించిన విషయం తెలిసిందే.
News April 4, 2026
రేపే ఉప్పల్‌లో మ్యాచ్.. వీటిపై నిషేధం

రేపు 3.30PMకు ఉప్పల్‌లో SRH, LSG తలపడనున్నాయి. స్టేడియం వద్ద క్లాక్‌రూమ్ ఉండదని, నిషేధిత వస్తువులు తీసుకురావొద్దని పోలీసులు సూచించారు.
వీటిపై నిషేధం: ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, హ్యాండ్ బ్యాగులు, బ్యాక్‌ప్యాక్స్, హెల్మెట్లు, ఇయర్ పాడ్స్, కీ చైన్లు, పెన్నులు, పదునైన వస్తువులు, ఆయుధాలు, వాటర్ బాటిళ్లు, చిరుతిళ్లు, అగ్గిపెట్టెలు, సిగరెట్లు, లైటర్లు, బ్యానర్లు.
News April 4, 2026
ప్రభాస్ ‘ఫౌజీ’ ఫొటోలు లీక్.. మేకర్స్ వార్నింగ్

హను రాఘవపూడి డైరెక్షన్‌లో ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ షూటింగ్‌కు సంబంధించి లీకైన కొన్ని ఫొటోలు వైరలవుతున్నాయి. దీనిపై మేకర్స్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి కంటెంట్‌పై రిపోర్ట్ చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆ ఫొటోలను షేర్ చేయొద్దని సూచించారు. ఇలాంటి లీకుల వల్ల సినిమా నిర్మాణంపై ప్రభావం పడుతుందన్నారు. సిల్వర్ స్క్రీన్‌పై మూవీని చూస్తే అద్భుతంగా ఉంటుందని చెప్పారు.


