News March 22, 2024

ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు

image

TG: ఖైరతాబాద్ MLA దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయన ఓటర్లను ప్రలోభ పెట్టారని, సతీమణి పేరిట ఉన్న ఆస్తుల వివరాలను నామినేషన్ పత్రాల్లో పేర్కొనలేదంటూ విజయారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దానం ఎన్నికను రద్దు చేయాలని కోరారు. ఈ అంశంపై వివరణ ఇవ్వాలంటూ దానంకు హైకోర్టు నోటీసులిస్తూ.. తదుపరి విచారణను వచ్చే నెల 18కి వాయిదా వేసింది. కాగా ఇటీవలే ఆయన కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే.

Similar News

News October 2, 2024

పింఛన్ల కోసం రూ.12,508 కోట్ల ఖర్చు: CM చంద్రబాబు

image

AP: అధికారం చేపట్టిన 110 రోజుల్లో పింఛన్ల కోసం కూటమి ప్రభుత్వం రూ.12,508 కోట్లు ఖర్చు చేసిందని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘1వ తేదీనే 98% మంది లబ్ధిదారులు ఇంటి వద్దనే పింఛను అందుకోవడం ఎంతో సంతృప్తినిచ్చింది. ఒక్క రోజులో రికార్డు స్థాయిలో 64.38 లక్షల మందికి పింఛను అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వ ఉద్యోగులు సమర్థవంతంగా నిర్వహించారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.

News October 2, 2024

మినీ ఇండస్ట్రియల్ పార్కులకు భూ సేకరణ చేపట్టాలి: మంత్రి

image

TG: స్వయం సహాయక బృందాల కోసం ప్రభుత్వం మినీ ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయనుంది. వీటి కోసం ఒక్కో నియోజకవర్గంలో 2-3 ఎకరాల భూమి సేకరించాలని అధికారులను మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. ఒక్కో పార్కులో రెండంతస్తుల భవనాలను నిర్మించాలన్నారు. ప్రస్తుతం ఉన్న 65 లక్షల SHGలను 75 లక్షలకు పెంచాలని సూచించారు.

News October 2, 2024

‘ఆరోగ్యమే మహాభాగ్యం’.. గాంధీ ఆరోగ్య రహస్యాలివే!

image

గాంధీజీ ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారు. రోజువారీ ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉండేలా చూసుకునేవారు. ప్రొటీన్లు, విటమిన్లు అధికంగా ఉండే దంపుడు బియ్యాన్ని మాత్రమే తినేవారు. సేంద్రియ పద్ధతుల్లో పండించిన కూరగాయలనే ఇష్టపడేవారు. చక్కెరను పక్కనబెట్టి బెల్లం టీ తాగేవారు. రోజూ 15 కి.మీ నడవడంతో పాటు ప్రాణాయామం, వ్యాయామాలు చేసేవారు. ధూమపానం, మద్యపానం, మాంసాహారానికి బాపూజీ దూరం.