News October 4, 2024
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

TG: హైడ్రా కూల్చివేతలను వెంటనే నిలిపివేయాలంటూ KA పాల్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. కూల్చివేతలను ఇప్పటికిప్పుడు నిలిపివేయలేమంది. పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం, హైడ్రాకు నోటీసులు ఇచ్చింది. పిటిషన్లో G.O.99పై స్టే విధించాలని, కూల్చివేతలకు 30రోజుల ముందే నోటీసులు ఇవ్వాలని, హైడ్రాకు చట్టబద్ధత కల్పించాకే కూల్చివేతలు చేపట్టాలని పాల్ కోరారు. తదుపరి విచారణ ఈనెల 14న జరగనుంది.
Similar News
News November 7, 2025
15 అడుగుల ఎత్తు పెరిగిన గోంగూర మొక్క

TG: గోంగూర పంట 35 రోజుల్లోగా కోతకు వస్తుంది. మహా అయితే 4 అడుగుల ఎత్తు పెరుగుతుంది. అయితే సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మం. అప్పన్నపేటలోని కృష్ణారెడ్డి ఇంట్లో ఓ గోంగూర మొక్క ఏకంగా 15 అడుగుల ఎత్తు పెరిగింది. దీన్ని తొమ్మిది నెలల క్రితం నాటారు. ఇప్పటికీ ఈ మొక్కకు 25కుపైగా కొమ్మలు ఉండి గుబురుగా ఆకులు వస్తున్నాయి. ఈ మొక్క నుంచి వచ్చే ఆకులను సేకరించి ఇప్పటికీ కూరకు వాడుతున్నామని కృష్ణారెడ్డి తెలిపారు.
News November 7, 2025
ఎందరికో ఆదర్శం అరుణిమా సిన్హా జీవితం

జాతీయ స్థాయి వాలీబాల్ ప్లేయర్‌గా ఎన్నో విజయాలు సాధించిన అరుణిమాను దొంగల రూపంలో విధి వెక్కిరించింది. వారిని అడ్డుకునే క్రమంలో ఆమెను కదులుతున్న రైలులోంచి బయటకు తోసేసారు. ఈ ప్రమాదంలో ఆమె కాలును పూర్తిగా తొలగించారు. ఇటువంటి పరిస్థితుల్లోనూ జీవితం ముగిసిపోయిందని ఆమె బాధపడలేదు. ఏదో ఒకటి సాధించాలనే తపనతో ఎవరెస్టు అధిరోహించిన ప్రపంచ తొలి మహిళా వికలాంగురాలుగా చరిత్ర సృష్టించారు.
News November 7, 2025
ముందు ‘రూ./-’ వెనక ‘మాత్రమే’ ఎందుకు?

చెక్స్ లేదా చందా బుక్స్ తదితరాలపై అమౌంట్ రాసేటప్పుడు అంకెల ముందు ‘రూ.’ అని పెడతాం (Ex: రూ.116/-). ఇక అక్షరాల్లో రాస్తే చివర్లో ‘మాత్రమే’ (Ex: వంద రూపాయలు మాత్రమే) పేర్కొంటాం. ట్యాంపర్ ప్రూఫ్ సెక్యూరిటీ రీజన్‌తో ఈ పద్ధతి మొదలైంది. ఇప్పుడంటే కంప్యూటర్ యుగం కానీ ఒకప్పుడు చేతి రాతలతో మాన్యువల్‌గా పనులు జరిగేవి. దీంతో అమౌంట్ ముందు లేదా వెనక ఏ నంబర్/పదం యాడ్ చేయలేకుండా బ్యాంకులు ఈ పద్ధతి మొదలుపెట్టాయి.


