News May 24, 2024

పిన్నెల్లికి హైకోర్టు ఆదేశాలు

image

AP: ఓట్ల లెక్కింపు రోజు YCP ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్లకు వెళ్లవద్దని హైకోర్టు ఆదేశించింది. నరసరావుపేట కౌంటింగ్ కేంద్రానికి వెళ్లేందుకు మాత్రం అనుమతి కల్పించింది. EVM ధ్వంసం కేసులో పిన్నెల్లిని అరెస్ట్ చేయాలని EC ఆదేశించగా.. ముందస్తు బెయిల్‌ కోసం ఆయన హైకోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ముందస్తు బెయిల్ మంజూరు చేసిన కోర్టు.. తాజాగా బెయిల్‌పై మరికొన్ని ఉత్తర్వులు జారీ చేసింది.

Similar News

News February 11, 2026

T20WC: ఆస్ట్రేలియా స్కోర్ ఎంతంటే?

image

కొలంబోలో ఐర్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. 45 రన్స్‌తో స్టొయినిస్ టాప్ స్కోరర్‌గా నిలిచారు. ఇంగ్లిస్(37), రెన్షా(37) రాణించారు. మార్క్ ఆదైర్ 2 వికెట్లు తీసుకున్నారు. ఐర్లాండ్ గెలవాలంటే 183 పరుగులు చేయాలి.

News February 11, 2026

రాహుల్ ఆరోపణలకు హర్దీప్ సింగ్ కౌంటర్

image

లోక్‌సభలో LoP రాహుల్ గాంధీ తనపై చేసిన <<19111987>>వ్యాఖ్యలన్నీ<<>> అబద్ధాలేనని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి కొట్టిపారేశారు. ‘3 లక్షల ఈమెయిల్స్‌లో నా గురించి 4 లైన్లే ఉంది. మేకిన్ ఇండియా చర్చల్లో భాగంగా అతనితో పలుమార్లు భేటీ అయ్యా. మా మధ్య ఒక మెయిల్ సంభాషణే ఉంది’ అని అన్నారు. గతంలో రాహుల్ చేసిన ఓట్ చోరీ ఆరోపణలు కూడా అబద్ధమని తేలాయని పురి విమర్శించారు.

News February 11, 2026

లోక్‌సభలో రగడ.. అసలు రాహుల్ ఏమన్నారంటే?

image

ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లోక్‌సభలో మాట్లాడుతూ ఎప్‌స్టీన్ ఫైల్స్ ప్రస్తావన తేవడం రాజకీయ దుమారం రేపింది. ‘ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో పేరున్న పారిశ్రామికవేత్త అనిల్ అంబానీని ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? అసలు ఎప్‌స్టీన్‌కు అనిల్‌ను పరిచయం చేసిందెవరో కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్ పురికి తెలుసు’ అని రాహుల్ వ్యాఖ్యానించడంతో బీజేపీ తీవ్ర అభ్యంతరం తెలిపింది.