News October 16, 2024

గ్రూప్-1 నియామకాలపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ

image

TG: గ్రూప్-1 నియామక ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. గ్రూప్-1 నియామకాల్లో దివ్యాంగుల రిజర్వేషన్ల అంశంపై దాఖలైన పిటిషన్లపై ఇవాళ విచారణ జరిపింది. నియామకాలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తిస్థాయి వాదనల కోసం విచారణను నవంబర్ 20కి వాయిదా వేసింది. కాగా ఈనెల 21 నుంచి మెయిన్స్ పరీక్షలున్నాయని, 3 నెలల్లో ఫలితాలు విడుదల చేస్తామని TGPSC కోర్టుకు తెలిపింది.

Similar News

News October 17, 2024

లెబనాన్‌పై భీకర దాడులు.. మేయర్ మృతి

image

లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడుల్ని తీవ్రతరం చేస్తోంది. హెజ్బొల్లా మిలిటెంట్ల స్థావరాలే లక్ష్యంగా ఖనా నగరంపై జరిపిన ఎయిర్ స్ట్రైక్‌లో నబాతియే మేయర్ అహ్మద్ కహిల్ మరణించారు. ఆయనతో సహా 15 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు ఇజ్రాయెల్ దాడుల్లో 250 మంది మిలిటెంట్లు మరణించారు. తమ సరిహద్దుల్లో హెజ్బొల్లాను తరిమికొట్టేంత వరకు కాల్పుల విరమణ చేపట్టమని ఇజ్రాయెల్ PM నెతన్యాహు తేల్చిచెప్పారు.

News October 17, 2024

హిట్‌మ్యాన్ ఇప్పుడు మరింత ‘ఫిట్’మ్యాన్!

image

న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌ ముంగిట రోహిత్ శర్మ ఇటీవల ఎన్నడూ లేనంత ఫిట్‌గా కనిపిస్తున్నారు. బెంగళూరు గ్రౌండ్‌లో ప్రాక్టీస్ సందర్భంగా ఆయన ఫొటోలు బయటికొచ్చాయి. ఇంతకు ముందుతో పోలిస్తే సన్నగా, కండలు తిరిగిన దేహంతో హి‌ట్‌మ్యాన్ కనిపిస్తున్నారు. ఇప్పుడు రోహిత్ హిట్‌మ్యాన్ కాదు ఫిట్‌మ్యాన్ అంటూ ఆయన ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. రోహిత్ ప్రస్తుతం వన్డేలు, టెస్టులు మాత్రమే ఆడుతుండటం తెలిసిందే.

News October 17, 2024

రేపటి నుంచి కాలేజీలు బంద్

image

TG: ఫార్మసీ కాలేజీల్లో రేపటి నుంచి క్లాసులు బంద్ చేస్తున్నట్లు యాజమాన్యాలు ప్రకటించాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. ఇప్పటికే డిగ్రీ, పీజీ కాలేజీలు బంద్‌ను చేపడుతుండగా, రేపటి నుంచి ఫార్మసీ కాలేజీలు సైతం బంద్‌లో పాల్గొననున్నాయి.