News May 14, 2024

CBNపై FIR కొట్టివేతకు హైకోర్టు నిరాకరణ

image

టీడీపీ అధినేత చంద్రబాబు జైలు సిబ్బందిపై దాడికి పాల్పడ్డారంటూ 2010లో నమోదైన కేసును కొట్టివేసేందుకు బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ నిరాకరించింది. బాబ్లీ ప్రాజెక్ట్ విషయంలో 2010లో బాబును MH పోలీసులు అరెస్ట్ చేసి ధర్మాబాద్‌ జైలులో ఉంచారు. అక్కడి నుంచి ఔరంగాబాద్ సెంట్రల్ జైలుకు తరలించే సమయంలో సిబ్బందిపై టీడీపీ శ్రేణులు దాడి చేశాయి. ఈ కేసులో CBN, ఆనంద్ బాబుపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.

Similar News

News January 7, 2025

తెలంగాణ హైకోర్టు సీజే బదిలీకి సిఫార్సు

image

తెలంగాణ హైకోర్టు సీజే అలోక్ అరాధే బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఆయనను బాంబే హైకోర్టు సీజేగా బదిలీ చేయాలని ప్రతిపాదించింది. 2023 జులైలో రాష్ట్ర హైకోర్టు సీజేగా అలోక్ నియమితులయ్యారు. మరోవైపు బాంబే హైకోర్టు సీజే దేవేంద్ర కుమార్‌ను ఢిల్లీ HCకి బదిలీ చేయాలని సిఫార్సు చేసింది.

News January 7, 2025

YS జగన్ సమీప బంధువు మృతి

image

AP: YS జగన్ సమీప బంధువు అభిషేక్ రెడ్డి కన్నుమూశారు. బ్రెయిన్ డెడ్‌తో మూడు నెలల నుంచి కోమాలో ఉన్న ఆయన HYD AIGలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. YS ప్రకాశ్ రెడ్డి మనవడు అయిన ఆయన జగన్‌కు సోదరుడి వరుస అవుతారు. 2019 ఎన్నికల్లో కడప జిల్లాలో వైసీపీ విజయం కోసం ఆయన తీవ్రంగా పనిచేశారు. బెంగళూరులో స్కూలు విద్యాభ్యాసం, ఖమ్మం మమతా కాలేజీలో MBBS చదివారు.

News January 7, 2025

ALERT.. రేపటి నుంచి జాగ్రత్త

image

తెలంగాణలో రానున్న 4 రోజుల పాటు చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. జనవరి 8 నుంచి 11 వరకు ఉష్ణోగ్రతలు 5 డిగ్రీలు తగ్గుతాయని తెలిపింది. ఆదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, మెదక్, నిర్మల్, సంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉదయం వేళ పొగమంచు అధికంగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది.