News October 16, 2024

ఐఏఎస్‌లకు హైకోర్టు షాక్

image

క్యాట్ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఐఏఎస్‌లకు షాక్ తగిలింది. ఇలాంటి వ్యవహారంలో తాము జోక్యం చేసుకుంటే ముగింపు ఉండదని జడ్జి వ్యాఖ్యానించారు. ముందుగా వెళ్లి ఏపీలో రిపోర్ట్ చేయాలని ఐఏఎస్‌లను ఆదేశించారు. డీవోపీటీ ఉత్తర్వుల ప్రకారం ఏపీలో రిపోర్ట్ చేయాలని క్యాట్ తీర్పునివ్వడంతో ఆమ్రపాలి, రోనాల్డ్ రాస్, వాణీ ప్రసాద్, కరుణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

Similar News

News October 16, 2024

కాంగ్రెస్ తెచ్చిన మార్పు ఏంటంటే?: హరీశ్ రావు

image

TG: పథకాలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ‘మహిళలకు 2 బతుకమ్మ చీరలు ఇస్తానని ఇవ్వలేదు. రూ.15వేల రైతుబంధు అమలు చేయలేదు. ఆగస్టులో చేయాల్సిన చేప పిల్లల పంపిణీ అక్టోబర్ వచ్చినా చేయలేదు. KCR కిట్ కంటే మంచిది ఇస్తానని చెప్పి గర్భిణులను మోసం చేశారు’ అని మండిపడ్డారు. ఉన్న పథకాలను నిలిపివేయడమే కాంగ్రెస్ తెచ్చిన మార్పు అని అన్నారు.

News October 16, 2024

‘అతిరథ మహారథులు’ అంటే ఎవరు?

image

రాజకీయ సభల్లో వేదికపై ఉన్న అతిరథ మహారథులు అంటూ ప్రసంగాలు మొదలుపెడుతుంటారు. అసలు ఆ పదాన్ని ఎవరికి వాడాలి? అతిరథ మహారథులు అంటే ఎవరు? అనే విషయాన్ని తెలుసుకుందాం. యుద్ధంలో పాల్గొన్న యోధుల సామర్థ్యాన్ని తెలిపేందుకు ఈ పదాన్ని వాడతారు. ఏకకాలంలో 5వేల మందితో యుద్ధం చేసేవారిని రథి అని, 60వేల మందితో యుద్ధం చేస్తే అతిరథ అని, 7లక్షల మందితో యుద్ధం చేసేవారిని మహారథి అని అంటారు. వీరు మాత్రమే ఆ పిలుపునకు అర్హులు.

News October 16, 2024

UPDATE: నెల్లూరుకు 370కి.మీ దూరంలో వాయుగుండం

image

నైరుతి బంగాళాఖాతంలో పశ్చిమ వాయవ్య దిశగా 15 కి.మీ వేగంతో వాయుగుండం కదులుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. చెన్నైకి 280 కి.మీ, పుదుచ్చేరికి 320 కి.మీ, నెల్లూరుకి 370kmల దూరంలో కేంద్రీకృతమైనట్లు పేర్కొంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ సంభవించే అవకాశం ఉందని చెప్పింది.