News March 27, 2024

సీఎంకు హైకోర్టు షాక్

image

లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. మనీలాండరింగ్ ఆరోపణలతో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న ఆయన.. ఈడీ రిమాండ్‌ను సవాల్ చేస్తూ, మధ్యంతర బెయిల్‌ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వీటిపై విచారణ చేసిన హైకోర్టు బెయిల్ ఇవ్వలేదు. పిటిషన్‌పై తదుపరి విచారణను ఏప్రిల్ 3కు వాయిదా వేసింది. ఏప్రిల్ 2లోగా కౌంటర్ దాఖలు చేయాలని EDని ఆదేశించింది.

Similar News

News January 22, 2026

చికిత్సకు డబ్బులు లేవని.. హృదయ విదారక ఘటన

image

TG: HYD కూకట్‌పల్లిలో హృదయ విదారక ఘటన జరిగింది. దివ్యాంగురాలైన కూతురు శ్రీజావలి(18) ట్రీట్‌మెంట్‌కు డబ్బులు లేవని తల్లిదండ్రులే గొంతునులిమి చంపేశారు. తర్వాత 2రోజులు శవాన్ని ఇంట్లోనే పెట్టుకున్నారు. ఇవాళ కొడుకు నితిల్‌తో కలిసి భార్యభర్తలు సతీశ్, ఆమని పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. అది పనిచేయలేదని ముగ్గురూ చేతులు కోసుకున్నారు. బాధ భరించలేక నితిల్ తన ఫ్రెండ్‌కు ఫోన్ చేయడంతో విషయం బయటపడింది.

News January 22, 2026

సన్ గ్లాసెస్‌తో మాక్రాన్.. కారణమదేనా?

image

దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌లో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మాక్రాన్ సన్‌గ్లాసెస్ ధరించడం చర్చనీయాంశమైంది. కంటి సమస్య(రక్తం గడ్డకట్టడం) వల్లే ఆయన గ్లాసెస్ ధరించారని ఫ్రెంచ్ మీడియా చెబుతుండగా తగ్గేదేలే అంటూ ట్రంప్‌నకు ఆయన మెసేజ్ ఇచ్చారేమోనని పలువురు నెటిజన్లు పేర్కొంటున్నారు. తాజాగా <<18905776>>ట్రంప్<<>> దీనిపై WEFలో మాట్లాడుతూ ‘మాక్రాన్ బ్యూటిఫుల్ గ్లాసెస్ ధరించి కనిపించారు. అసలేం జరిగింది?’ అని వెటకారంగా అన్నారు.

News January 22, 2026

భారత ప్లేయర్‌కు గాయం

image

న్యూజిలాండ్‌తో జరుగుతోన్న తొలి టీ20లో టీమ్ ఇండియా స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ గాయపడ్డారు. 16వ ఓవర్లో మిచెల్ కొట్టిన బంతిని పట్టుకునేందుకు ప్రయత్నించగా ఆయన వేలికి గాయమైంది. చేతి నుంచి రక్తం రావడంతో నొప్పితో మైదానాన్ని వీడారు. గాయం తీవ్రత ఎక్కువైతే తర్వాతి మ్యాచుల్లో అక్షర్ ఆడేది అనుమానమే.