News January 7, 2025
కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై నేడు హైకోర్టు తీర్పు
TG: ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఇవాళ తీర్పు వెల్లడించనుంది. తనపై ఏసీబీ కేసు కొట్టివేయాలన్న పిటిషన్‌పై ఇటీవల వాదనలు ముగిశాయి. తీర్పు వెల్లడించే వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇవాళ ఉదయం 10:30కు తీర్పు వెల్లడించనుంది. క్వాష్ పిటిషన్‌పై ధర్మాసనం ఎలాంటి తీర్పు ఇస్తుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Similar News
News January 8, 2025
మరో అమ్మాయితో చాహల్ (PHOTO)
ధనశ్రీతో విడాకుల వార్తల నేపథ్యంలో భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ మరో అమ్మాయితో కెమెరాకు చిక్కారు. ముంబైలోని ఓ హోటల్ నుంచి బయటకు వచ్చే సమయంలో చాహల్ తన ముఖానికి చేతులు అడ్డుపెట్టుకుని కనిపించారు. ఆ యువతి పేరు తనిష్క కపూర్ అని, కన్నడలో రెండు సినిమాల్లో నటించినట్లు వార్తలు వస్తున్నాయి. ధనశ్రీతో పరిచయం కాకముందు వీరిద్దరూ డేటింగ్ చేసినట్లు సమాచారం. అప్పట్లో చాహల్ ఈ వార్తలను కొట్టిపారేశారు.
News January 8, 2025
సర్టిఫికెట్లు ఆపితే విద్యాసంస్థల అఫిలియేషన్ రద్దు!
AP: అడ్మిషన్ల వేళ ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకోవడం, ఫీజు కట్టలేదని సర్టిఫికెట్లు ఆపుతున్నట్లు ఫిర్యాదులు రావడంపై కాలేజీలపై ప్రభుత్వం సీరియస్ అయింది. అదనపు ఫీజుల వసూలు, రీయింబర్స్‌మెంట్ వర్తించే వారినీ ఫీజు కట్టాలని ఒత్తిడి చేసే విద్యాసంస్థల అఫిలియేషన్ రద్దు చేయాలని నిర్ణయించింది. అడ్మిషన్ తీసుకున్న తర్వాత వద్దనుకుంటే 5% మినహాయించి 15 రోజుల్లో కట్టిన ఫీజు వెనక్కి చెల్లించాలని ఆదేశించింది.
News January 8, 2025
జులై నుంచి చిరంజీవి-అనిల్ మూవీ షూటింగ్?
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించనున్న సినిమా సంక్రాంతి కానుకగా ఈనెల 15న లాంచ్ కానున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. జులై నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని సమాచారం. మంచి కామెడీ టైమింగ్ ఉన్న వీరిద్దరి కాంబోలో ఎలాంటి మూవీ రూపొందనుందనే దానిపై ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది. అనిల్ డైరెక్ట్ చేసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఈనెల 14న రిలీజ్ కానుండగా, చిరు ప్రస్తుతం ‘విశ్వంభర’లో నటిస్తున్నారు.