News November 22, 2024
పార్టీ మారిన MLAలపై హైకోర్టు కీలక తీర్పు
TG: పార్టీ ఫిరాయించి కాంగ్రెస్‌లో చేరిన MLAలపై అనర్హత వేటు వేయాలని BRS దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తీర్పు ఇచ్చింది. పార్టీ మారిన MLAల విషయంలో తగిన సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవచ్చని చెప్పింది. 10వ షెడ్యుల్ ప్రకారం అనర్హతపై ఆ నిర్ణయం ఉండాలని సూచించింది. ‘4 వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి’ అని గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును తాజాగా డివిజన్ బెంచ్ కొట్టేసింది.
Similar News
News November 22, 2024
నటుడు దర్శన్‌కి వ్యతిరేకంగా మరిన్ని సాక్ష్యాధారాలు
రేణుకా స్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్‌కి వ్యతిరేకంగా మరిన్ని సాక్ష్యాధారాలు పోలీసులకు లభించాయి. వాటి ఆధారంగా 1000 పేజీల అదనపు ఛార్జిషీట్‌ను వారు నమోదు చేశారు. కొత్తగా 20 వరకు సాక్ష్యాలు లభించినట్లు అందులో పేర్కొన్నారు. పునీత్ అనే సాక్షి మొబైల్ ఫోన్లో ఫొటోలు లభించినట్లు సమాచారం. ఆ ఫొటోలు హత్య జరిగిన చోట దర్శన్ ఉన్న సమయంలో తీసినవిగా తెలుస్తోంది.
News November 22, 2024
మూడో ప్రపంచ యుద్ధం మొదలైంది: ఉక్రెయిన్ మాజీ సైన్యాధికారి
మూడో ప్రపంచ యుద్ధం ఇప్పటికే ప్రారంభమైందని, రష్యా మిత్రదేశాలు ఉక్రెయిన్‌తో యుద్ధంలో పాల్గొనడమే నిదర్శనమని ఉక్రెయిన్ Ex సైన్యాధికారి వలెరీ జలుఝ్నీ అన్నారు. ఉత్తర కొరియా బలగాలు, ఇరాన్ ఆయుధాలను ప్రయోగించి అమాయకులను రష్యా హతమార్చడం 3వ ప్రపంచ యుద్ధానికి సాక్ష్యమన్నారు. నిర్ణయాత్మక చర్యల ద్వారా యుద్ధాన్ని ఇరు దేశాలకే పరిమితం చేయాలని ఉక్రెయిన్ మిత్రపక్షాలను వలెరీ కోరారు.
News November 22, 2024
అసెంబ్లీ కమిటీల ఎన్నిక కౌంటింగ్ పూర్తి..(1/2)
AP: PAC, పీయూసీ, అంచనాల కమిటీల ఎన్నిక కౌంటింగ్ పూర్తైంది. కమిటీ సభ్యులను స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. ఎన్డీఏ MLAలు ఓట్లు వేయగా, ఎన్నికను వైసీపీ బాయ్‌కాట్ చేసిన విషయం తెలిసిందే.
☛ PAC కమిటీ సభ్యులు
1. నక్కా ఆనందబాబు, 2. ఆరిమిల్లి రాధాకృష్ణ, 3. అశోక్ రెడ్డి, 4. బూర్ల రామాంజనేయులు, 5. జయనాగేశ్వర్ రెడ్డి, 6. లలిత కుమారి, 7. శ్రీరామ్ రాజగోపాల్, 8. పులపర్తి రామాంజనేయులు, 9. విష్ణుకుమార్ రాజు.