News January 8, 2025

కేటీఆర్ పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు

image

TG: ఏసీబీ విచారణకు కేటీఆర్ వెంట లాయర్‌ను తీసుకెళ్లొచ్చని హైకోర్టు తెలిపింది. ఆడియో, వీడియో రికార్డు చేసేందుకు నిరాకరించగా సీసీ టీవీ పర్యవేక్షణలో విచారణ జరపాలని ఏసీబీని ఆదేశించింది. మరోవైపు కేటీఆర్ వెంట లాయర్ రామచంద్రరావు వెళ్లనున్నారు. లైబ్రరీలో కేటీఆర్ న్యాయవాది కూర్చోని విచారణను చూసే సౌకర్యం ఉందని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. విచారణ తర్వాత అనుమానాలుంటే కోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది.

Similar News

News February 10, 2026

EMIల కోసం నటించను: పంకజ్ త్రిపాఠి

image

‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్‌తో పాపులర్ అయిన నటుడు పంకజ్ త్రిపాఠి ఆలస్యంగా సినిమాలు చేయడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొన్నేళ్ల పాటు తీరిక లేకుండా నటించడంతో బ్రేక్ తీసుకోవాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. EMI కట్టేందుకో, మనుగడ సాగించేందుకో నటించలేనన్నారు. తనలోని నటుడిని సంతృప్తి పరిచే రోల్స్‌ను సెలక్ట్ చేసుకుంటానని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. పాత్రల ఎంపికపై మరింత ఫోకస్ చేసినట్లు పేర్కొన్నారు.

News February 10, 2026

ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడనివ్వం: చంద్రబాబు

image

AP: ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడనివ్వమని CM చంద్రబాబు స్పష్టం చేశారు. విద్యుత్ కొనుగోలు భారాన్ని కూడా తగ్గించుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అగ్నిమాపక, పురపాలక, అటవీ, స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో నిబంధనలు సరళతరం చేయాలన్నారు. కేంద్రం నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని మంత్రులు, కార్యదర్శులతో సమావేశంలో పేర్కొన్నారు. పన్ను వసూళ్లు తగ్గకూడదని, వ్యాపారులను వేధించకూడదని చెప్పారు.

News February 10, 2026

ఫిబ్రవరి 10: చరిత్రలో ఈరోజు

image

☛ 1921: ఇండియా గేట్‌కు శంకుస్థాపన
☛ 1923: X-కిరణాల సృష్టికర్త విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్ మరణం
☛ 1985: సినీ గాయని ప్రియా హిమేశ్ జననం
☛ 1990: సింగర్ రేవంత్ జననం
☛ 1993: స్వాతంత్ర్య సమరయోధుడు గయా ప్రసాద్ కటియార్ మరణం (ఫొటోలో)
☛ 2010: భారత ఆర్థికవేత్త, తొలి ప్రణాళికా సంఘం సభ్యుడు KN.రాజ్ మరణం
☛ జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం