News August 25, 2025

రేపు హైలెవెల్ మీటింగ్.. టారిఫ్స్‌పై చర్చ!

image

ట్రంప్ సెకండరీ టారిఫ్స్ ఈనెల 27 నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో రేపు PM మోదీ ఆఫీస్‌లో హైలెవెల్ మీటింగ్ జరగనున్నట్లు తెలిసింది. PM ప్రిన్సిపల్ సెక్రటరీ నేతృత్వంలో నిర్వహించే ఈ సెషన్‌లో 50% టారిఫ్స్‌తో ఎగుమతిదారులపై పడే ప్రభావం గురించి చర్చిస్తారని సమాచారం. ఇప్పటికే ఎక్స్‌పోర్టర్స్, ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్స్‌ నుంచి కేంద్రం డేటా సేకరించింది. నష్ట నివారణకు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.

Similar News

News August 25, 2025

ఇన్‌స్టా చూడటమే ఉద్యోగం!

image

కొందరు ఎక్కువసేపు సోషల్ మీడియా చూస్తూ కాలక్షేపం చేస్తుంటారు. అలాంటి వారికి ఉద్యోగం ఇచ్చే కంపెనీ ఒకటుంది. ముంబైకి చెందిన మాంక్ ఎంటర్టైన్మెంట్ ‘డూమ్ స్క్రోలర్’ పేరిట ఉద్యోగ అవకాశాన్ని ఇస్తోంది. సదరు ఉద్యోగి ప్రధానంగా ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో కనీసం 6 గంటల సమయం గడుపుతూ ట్రెండింగ్ అంశాలు, వైరల్ కంటెంట్‌ను గుర్తించాలి. వీరికి హిందీ & ఇంగ్లిష్ వచ్చి ఉండాలి.

News August 25, 2025

ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల

image

AP: వైద్యారోగ్యశాఖలో 185 డాక్టర్ల నియామకానికి ప్రభుత్వం <>నోటిఫికేషన్ <<>>ఇచ్చింది. ఒప్పంద విధానంలో పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ఆయుష్మాన్ కేంద్రాల్లో ఈ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. MBBS అర్హతతో 155 వైద్యుల పోస్టులు, టెలిమెడిసిన్ హబ్‌లో 13 జనరల్ మెడిసిన్ పోస్టులు, గైనకాలజిస్టులు-3, చిన్న పిల్లల వైద్యులు-14 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇవాళ్టి నుంచి SEP 10 వరకు దరఖాస్తు చేయవచ్చు.

News August 25, 2025

ఏపీ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తుల బదిలీ

image

దేశ వ్యాప్తంగా 14 మంది హైకోర్టు న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. ఇందులో ముగ్గురు న్యాయమూర్తులను ఏపీకి బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. గుజరాత్ హైకోర్ట్ జడ్జి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, అలహాబాద్ హైకోర్ట్ జడ్జి జస్టిస్ డి.రమేశ్, కలకత్తా హైకోర్ట్ జడ్జి జస్టిస్ సుభేందు సమంత ఏపీ హైకోర్టుకు బదిలీ అయ్యారు.