News February 27, 2025
CANCER సోకిన మహిళల్లోనే అధిక మరణాలు!

క్యాన్సర్ వచ్చిన ఐదుగురిలో ముగ్గురు చనిపోతున్నారని ఇండియన్ మెడికల్ ప్యానెల్ వెల్లడించింది. ది లాన్సెట్లో ప్రచురితమైన ICMR తాజా నివేదిక ప్రకారం గత దశాబ్దంలో పురుషుల కంటే మహిళల్లో క్యాన్సర్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. రాబోయే 2 దశాబ్దాల్లో ఇది పెరుగుతూనే ఉంటుందని పరిశోధకులు అంచనా వేశారు. క్యాన్సర్ మరణాలు పురుషుల కంటే స్త్రీలలోనే ఎక్కువగా ఉన్నాయి. కాగా, 2012- 2022 మధ్య క్యాన్సర్ కేసులు 36% పెరిగాయి.
Similar News
News November 27, 2025
నల్గొండ: ప్రీ-మెట్రిక్ స్కాలర్షిప్లకు దరఖాస్తుల ఆహ్వానం

నల్గొండ జిల్లాలో ఎస్సీ (SC) వర్గానికి చెందిన విద్యార్థులు ప్రీ-మెట్రిక్ ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకోవాలని SCDD డిప్యూటీ డైరెక్టర్ శశికళ తెలిపారు. 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, 9, 10వ తరగతి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ఆమె తెలిపారు.
News November 27, 2025
R.G.L- 7034 వరి రకం ప్రత్యేకతలు

R.G.L- 7034 సన్నగింజ వరి రకం. మొక్క ఎత్తు 100-105 సెం.మీ. దుబ్బుకు 10 నుంచి 14 పిలకలు వస్తాయి. వెయ్యి గింజల బరువు 14.5 గ్రాములు. చిట్టిముత్యాలు, NLR 34449 రకాలను క్రాసింగ్ చేసి R.G.L- 7034ను అభివృద్ధి చేశారు. బలమైన వేరు వ్యవస్థ కలిగి తుఫాన్ సమయంలో పడిపోలేదు. గింజ రాలడం తక్కువ. కాండం దృఢంగా ఉంటుంది. ఉల్లికోడు, దోమపోటు, మానిపండు తెగుళ్లను తట్టుకుంటుంది. హెక్టారుకు 6.5 టన్నుల దిగుబడి వస్తుంది.