News April 2, 2025
కాలేజీల అనుమతికి హైపవర్ కమిటీ

AP: మెడికల్, డెంటల్, నర్సింగ్ కాలేజీల అనుమతికి ఇచ్చే ఈసీ జారీకి హైపవర్ కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైకోర్ట్ రిటైర్డ్ జడ్జి జస్టిస్ దుర్గాప్రసాదరావు దీనికి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఎన్టీఆర్ వర్సిటీ వీసీ, స్విమ్స్ డైరెక్టర్, వైద్యవిద్య డైరెక్టర్‌తో ఈ కమిటీ ఉండనుంది. ప్రైవేట్ రంగంలో ఏర్పాటయ్యే కాలేజీలకు ఈసీ జారీ, తనిఖీ కోసం ఈ కమిటీ పనిచేయనుంది.
Similar News
News April 3, 2025
ఆల్‌టైమ్ రికార్డును సమం చేసిన భువీ

RCB స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఆల్‌టైమ్ రికార్డును సమం చేశారు. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన పేసర్‌గా ఘనత సాధించారు. ఇప్పటివరకు ఆయన 183 వికెట్లు తీసి డ్వేన్ బ్రావో రికార్డును భువీ సమం చేశారు. గుజరాత్‌తో జరిగిన మ్యాచులో స్వింగ్ కింగ్ ఈ ఫీట్ సాధించారు. అలాగే IPL చరిత్రలో పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గానూ ఆయన కొనసాగుతున్నారు. టోర్నీ పవర్ ప్లేలో ఇప్పటివరకు 73 వికెట్లు పడగొట్టారు.
News April 3, 2025
HCU వివాదంపై స్పందించిన రష్మిక మందన్న

HCU (హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ) వివాదంపై హీరోయిన్ రష్మిక మందన్న స్పందించారు. ఇందుకు సంబంధించి ఆమె తన SM ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘రాత్రికి రాత్రే జేసీబీలు, బుల్డోజర్లు.. విద్యార్థుల అరెస్టులు.. HCUలో అసలేం జరుగుతోంది. ఇప్పుడే ఈ విషయం తెలిసింది. నా హృదయం ముక్కలైనట్లు ఉంది. ఇది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది’ అంటూ రష్మిక రాసుకొచ్చారు. కాగా హెచ్‌సీయూలో 400 ఎకరాల భూవివాదం జరుగుతున్న విషయం తెలిసిందే.
News April 3, 2025
జనాలను ఫూల్స్ చేస్తున్న చంద్రబాబు: రోజా

AP: ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సీఎం చంద్రబాబు జనాలను ఫూల్స్ చేస్తున్నారని వైసీపీ నేత రోజా విమర్శించారు. సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చడం చేతకాకపోతే పదవి నుంచి దిగిపోవాలని ఆమె డిమాండ్ చేశారు. ‘చంద్రబాబు ఈవీఎంలను మేనేజ్ చేస్తారు కానీ కరువును మాత్రం చేయలేకపోతున్నారు. కరువుతో చాలా జిల్లాలు అల్లాడిపోతున్నా పట్టించుకోవడం లేదు. బాబు చెప్పే మాటలకు, చేసే పనులకు అసలు సంబంధమే లేదు’ అని ఆమె ఫైర్ అయ్యారు.