News October 2, 2024
హైడ్రాకు హై పవర్స్.. గవర్నర్ ఆమోదం

TG: హైడ్రాకు విశేష అధికారాలు కల్పించేలా ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌కు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. GHMC చట్టం 1955లో 374B సెక్షన్ చేరుస్తూ GOVT ఆర్డినెన్స్ జారీ చేసింది. ORR పరిధి వరకు ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, నాలాలు పరిరక్షిస్తూ హైడ్రాకు సర్వాధికారాలు కల్పించేలా ఈ చట్టాన్ని రూపొందించారు.
Similar News
News November 13, 2025
‘ఉగ్ర’వర్సిటీ.. పేలుళ్లకు పథక రచన అక్కడే!

ఢిల్లీ పేలుడు నేపథ్యంలో ఫరీదాబాద్ అల్ ఫలాహ్ వర్సిటీ వార్తల్లో నిలిచింది. దేశంలో కల్లోలం సృష్టించేందుకు ఇక్కడి నుంచే డా.ఉమర్ నబీ, ముజమ్మిల్ పథకం రచించారు. వీరు డాక్టర్లు షాహీన్, ఆదిల్‌తో సంప్రదింపులు జరిపారు. 4 నగరాల్లో పేలుళ్లు జరపాలనుకున్నారు. కానీ ఫండ్ రైజ్ డబ్బుల విషయంలో ఉమర్, ముజమ్మిల్ మధ్య విభేదాలు రావడంతో ప్లాన్ ప్రకారం వారు అనుకున్నట్లు జరగలేదు. లేదంటే మరింత మంది బలయ్యేవారేమో!
News November 13, 2025
తెలంగాణలో అంతర్జాతీయ మంచినీటి చేపల ఎగుమతుల కేంద్రం

దేశీయ మంచి నీటి చేపలను విదేశాలకు ఎగుమతి చేసేందుకు అంతర్జాతీయ మంచినీటి చేపల ఎగుమతుల కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీని కోసం తెలంగాణలోని రంగారెడ్డి(D) కోహెడలో 13ఎకరాలను ఎంపిక చేసింది. దీని ఏర్పాటుకు రూ.47 కోట్లను మంజూరు చేసింది. దేశంలోని జలాశయాలు, డ్యాములు, చెరువులు, కుంటల్లో చేపలను దేశవిదేశాలకు ఎగుమతి చేసేందుకు వీలుగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు.
News November 13, 2025
తెలుగు రాష్ట్రాల మత్స్యకారులకు ప్రయోజనం

మంచినీటిలో చేపల ఉత్పత్తికి సంబంధించిన ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి యోజన అమలులో దేశంలోనే తెలంగాణ తొలి స్థానంలో నిలిచింది. ఇక్కడ 2024లో మంచినీటి చేపల ఉత్పత్తి 4.39 లక్షల టన్నులు, మంచినీటి రొయ్యల ఉత్పత్తి 16,532 టన్నులుగా ఉంది. అందుకే ఈ కేంద్రం ఏర్పాటుకు తెలంగాణను కేంద్రం ఎంపిక చేసింది. దీని వల్ల తెలుగు రాష్ట్రాల మత్స్యకారులు, వ్యాపారులకు లబ్ధి కలగడంతో పాటు 5వేల మందికి ఉపాధి లభిస్తుంది.


