News July 1, 2024

జూన్‌లో అధిక వర్షపాతం.. జులైలోనూ సమృద్ధిగానే!

image

AP: జూన్‌లో సాధారణ వర్షపాతం 91.2MM కాగా 143.7MM నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. శ్రీసత్యసాయి జిల్లాలో అత్యధికంగా 180% వర్షపాతం కురవగా, ఆ తర్వాత అనంతపురం(177%) నిలిచినట్లు తెలిపింది. నైరుతి రుతుపవనాల కారణంగా రాయలసీమలోని 8 జిల్లాలు, అనకాపల్లి, నెల్లూరు జిల్లాల్లో అధిక వర్షపాతం, మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది. ఈనెలలోనూ సమృద్ధిగానే వానలు కురుస్తాయని అంచనా వేసింది.

Similar News

News July 3, 2024

రాహుల్ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవాలి: మోదీ

image

అగ్నివీర్, మైనార్టీ తదితర అంశాలను రాహుల్ గాంధీ తెరపైకి తెచ్చి లోక్‌సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ప్రధాని నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. రాహుల్ వ్యాఖ్యలను పిల్లల ప్రవర్తన అని చెప్పి తేలికగా తీసుకోవద్దని స్పీకర్ ఓం బిర్లాను కోరాను. హిందువులను ఎగతాళి చేయడం ఫ్యాషన్‌గా మారిపోయిందన్నారు. 60 ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీకి సీనియర్ నేతలున్నా అరాచక, అబద్ధాల మార్గంలో వెళ్లాలనుకోవడం ఆందోళనకరమన్నారు.

News July 3, 2024

మళ్లీ వరల్డ్ కప్‌లాంటి మజా

image

భారత వరల్డ్ కప్ హీరోలు యువరాజ్, రైనా, ఇర్ఫాన్ పఠాన్, ఉతప్ప‌, హర్భజన్ మళ్లీ మైదానంలో అఫ్రిదీ, మిస్బా, బ్రెట్‌లీ, కల్లిస్ అలనాటి ప్రత్యర్థులను ఎదుర్కోనున్నారు. వరల్డ్ ఛాంపియన్స్ ఆఫ్ లెజెండ్స్ 2024 లీగ్ నేటి నుంచి 13 వరకు జరగనుంది. ఇండియా ఈ రోజు ENGతో, 5న WI, 6న PAKతో, 8న AUSతో 10 SAతో తలపడనుంది. సాయంత్రం 5గంటల నుంచి స్టార్‌స్పోర్ట్స్‌ 1లో ప్రసారమవుతాయి.

News July 3, 2024

నల్లమలలో 154 ఏళ్ల తర్వాత అడవి దున్న

image

AP: నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు డివిజన్ పరిధిలోని బైర్లూటి రేంజ్‌లో అడవి దున్న కెమెరా ట్రాప్‌లో కనిపించింది. 1870 తర్వాత అడవి దున్న ఇక్కడ కనిపించడంతో ఫారెస్ట్ సిబ్బంది సైతం ఆశ్చర్యపోతున్నారు. వెలుగోడు రేంజ్‌లో ఈ ఏడాది జనవరిలో మొదటిసారి అడవిదున్నను గుర్తించామని.. అదే అక్కడికి వెళ్లినట్లు పేర్కొన్నారు. ఈ దున్న కర్ణాటక వైపు నుంచి కృష్ణా నదిని దాటి నల్లమలలోకి ప్రవేశించి ఉంటుందని భావిస్తున్నారు.