News November 28, 2024

280 కి.మీ వేగంతో వెళ్లేలా హైస్పీడ్ రైళ్లు

image

దేశంలో హైస్పీడ్ రైళ్లు త్వరలో అందుబాటులోకి వస్తాయని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. గంటకు 280 కి.మీ వేగంతో ప్రయాణించేలా BEMLతో కలిసి చెన్నై ICFలో వీటిని తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. ఒక్కో కోచ్ తయారీకి రూ.28 కోట్లు ఖర్చవుతుందని, ఇతర రైళ్ల బోగీలతో పోలిస్తే తయారీ ఖర్చు ఎక్కువన్నారు. ఆటోమేటిక్ డోర్స్, CCTV, మొబైల్ ఛార్జింగ్, ఫైర్ సేఫ్టీ సహా మరికొన్ని ఆధునాతన ఫీచర్లు ఈ రైళ్లల్లో ఉంటాయన్నారు.

Similar News

News November 12, 2025

శుభ సమయం (12-11-2025) బుధవారం

image

✒ తిథి: బహుళ అష్టమి తె.3.58 వరకు
✒ నక్షత్రం: ఆశ్లేష రా.12.11 వరకు
✒ శుభ సమయాలు: లేవు
✒ రాహుకాలం: మ.12.00-మ.1.30
✒ యమగండం: ఉ.7.30-ఉ.9.00
✒ దుర్ముహూర్తం: ఉ.11.36-మ.12.24
✒ వర్జ్యం: మ.1.13-మ.2.47
✒ అమృత ఘడియలు: రా.10.33-రా.12.07

News November 12, 2025

TODAY HEADLINES

image

➤ జూబ్లీహిల్స్(50.16%), బిహార్‌(66.91%)లో ముగిసిన పోలింగ్
➤ బిహార్‌లో NDA, జూబ్లీహిల్స్‌లో INC గెలుపు: ఎగ్జిట్ పోల్స్
➤ YCP పాలనలో పారిశ్రామికవేత్తలు పారిపోయారు: CM CBN
➤ అందెశ్రీ అంత్యక్రియలు పూర్తి.. పాడె మోసిన CM రేవంత్
➤ ఢిల్లీ పేలుడు సూత్రధారులు, పాత్రధారులను వదలబోమని PM మోదీ హెచ్చరిక
➤ ఢిల్లీ పేలుడు కేసు NIAకి అప్పగింత
➤ పాక్‌లో ఆత్మాహుతి దాడి.. 12 మంది మృతి, భారత్‌పై పాక్ PM ఆరోపణలు

News November 12, 2025

ఎగ్జిట్ పోల్స్: 2015, 2020లో ఏం జరిగింది?

image

బిహార్ ప్రజల నాడిని ఎగ్జిట్ పోల్స్ పట్టలేకపోతున్నాయని 2015, 2020 ఎన్నికల ఫలితాల్లో తేలింది. 2015లో మహాఘట్‌బంధన్‌(JDU+RJD+INC), NDAకు గట్టి పోటీ ఉంటుందని 6 మేజర్ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అయితే MGB 178 సీట్లు గెలవగా, NDA 58 సీట్లకు పరిమితమైంది. 2020లో MGB(INC+RJD)దే గెలుపని 11 ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. అయితే JDUతో కూడిన NDA 125 సీట్లతో అధికారంలోకి వచ్చింది.
* మరి ఈసారి తీర్పు ఎలా వస్తుందో?