News September 15, 2024
7 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం

TG: రాష్ట్ర సాధారణ వర్షపాతం 738mm కాగా ఈ వానాకాలం సీజన్లో ఈ నెల 11 నాటికి 897mm నమోదైనట్లు వాతావరణ అధికారులు తెలిపారు. సిద్దిపేట, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, నారాయణపేట, వనపర్తి, మహబూబ్‌నగర్, గద్వాల జిల్లాల్లో అత్యధిక వర్షాలు కురిశాయన్నారు. ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదవగా, మిగిలిన 24 జిల్లాల్లో అధిక వర్షాలు పడ్డాయని వెల్లడించారు.
Similar News
News December 6, 2025
ఖలీ భూమిపై దుండగుల కన్ను.. ఏం చేశాడంటే?

ఒంటిచేత్తో నలుగురిని ఎత్తిపడేసే బలం ఉన్న WWE స్టార్ రెజ్లర్ ది గ్రేట్ ఖలీ (దలీప్ సింగ్ రాణా) నిస్సహాయత వ్యక్తం చేశారు. హిమాచల్‌లోని పాంటా సాహిబ్‌లో కొందరు దుండగులు తన భూమిపైనే కన్నేశారని వాపోయారు. రెవెన్యూ అధికారుల అండతో వారు భూమిని ఆక్రమించడానికి యత్నించినట్లు ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించారు. ఇంతటి బడా సెలబ్రిటీకే ఈ దుస్థితి ఎదురైతే సామాన్యుల పరిస్థితి ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
News December 6, 2025
గవర్నర్‌కు గ్లోబల్ సమ్మిట్ ఆహ్వానం

TG: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు రావలసిందిగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానించారు. ఈమేరకు లోక్ భవన్లో గవర్నర్‌ను కలిసి ఆహ్వాన పత్రం అందించారు. CS రామకృష్ణారావు పాల్గొన్నారు. మరోవైపు మంత్రి అడ్లూరి హిమాచల్‌ప్రదేశ్, హరియాణా CMలు సుఖ్వీందర్ సింగ్ సుఖు, నాయబ్ సింగ్ సైనీలను కలిసి సమ్మిట్‌కు ఆహ్వానించారు.
News December 6, 2025
భారత్ టార్గెట్ ఎంతంటే?

భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో సౌతాఫ్రికా 270 పరుగులకు ఆలౌట్ అయింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టులో ఓపెనర్ డీకాక్ సెంచరీ(106)తో అదరగొట్టారు. కెప్టెన్ బవుమా 48, బ్రెవిస్ 29, బ్రీట్జ్కే 24 రన్స్‌తో రాణించగా మిగతావారు విఫలమయ్యారు. భారత బౌలర్లలో కుల్దీప్, ప్రసిద్ధ్ చెరో 4 వికెట్లతో చెలరేగారు. అర్ష్‌దీప్, జడేజా తలో వికెట్ పడగొట్టారు. భారత్ విజయానికి 271 రన్స్ అవసరం.


