News August 30, 2024
ఢిల్లీలో గత 12 ఏళ్లలోనే అత్యధిక వర్షపాతం

దేశ రాజధాని ఢిల్లీలో ఆగస్టు నెలలో ఇప్పటివరకు 378.5mmల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. గత 12 ఏళ్లలో ఇదే అత్యధికమని పేర్కొంది. 2013 ఆగస్టులో 321.4mm వర్షపాతం నమోదైనట్లు వెల్లడించింది. ఓవరాల్గా 1961 AUGలో నమోదైన 583.3mm వర్షపాతమే ఇప్పటికీ అత్యధికంగా ఉంది. మరోవైపు ఈ సీజన్లో ఇప్పటివరకు 825.5 మి.మీ.ల వర్షపాతం నమోదు కావడం గమనార్హం.
Similar News
News December 7, 2025
ఇవాళ 1,500 సర్వీసులు నడుపుతాం: ఇండిగో

ఇండిగో విమానాల సంక్షోభం ఆరో రోజూ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా పలు ఎయిర్పోర్టుల్లో పదుల సంఖ్యలో సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి. ఒక్క హైదరాబాద్లోనే 100 దాకా రద్దు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ప్రయాణికులకు పడిగాపులు తప్పడం లేదు. అయితే ఆదివారం కావడంతో రద్దీ కాస్త తగ్గినట్లు సమాచారం. మరోవైపు 95 శాతం కనెక్టివిటీని పునరుద్ధరించామని ఇండిగో చెబుతోంది. ఇవాళ 1,500 సర్వీసులు నడుపుతామని తెలిపింది.
News December 7, 2025
రబీ నువ్వుల సాగుకు అనువైన రకాలు

☛ ఎలమంచిలి 11(TNN వరాహ): పంట కాలం 80-85 రోజులు. నూనె 52%గా ఉంటుంది. దిగుబడి ఎకరాకు 300-350 కిలోలు. ఇది ముదురు గోధుమ రంగు విత్తనం. కోస్తా, రాయలసీమ జిల్లాలకు ఈ రకం అనుకూలం.
☛ ఎలమంచిలి 17: పంటకాలం 75-80 రోజులు. దిగుబడి ఎకరాకు 340-400 కిలోలు. గింజల్లో నూనె 52.5%గా ఉంటుంది. ఇది లేత గోధుమ రంగు విత్తనం. కోస్తా, రాయలసీమ జిల్లాలకు అనుకూలం. ఆకుమచ్చ తెగులను కొంత వరకు తట్టుకుంటుంది.
News December 7, 2025
కొడాలి నాని గురించి ప్రశ్న.. వదిలిపెట్టనన్న లోకేశ్

AP: రెడ్ బుక్ తన పని తాను చేసుకుంటూ పోతుందని మంత్రి లోకేశ్ మరోసారి స్పష్టం చేశారు. అమెరికా డల్లాస్లో తెలుగు డయాస్పొరా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కొందరు కొడాలి నాని గురించి అడగ్గా ‘నా తల్లిని అవమానిస్తే నేను వదిలిపెడతానా? మీ తల్లిని అవమానించినా వదిలిపెట్టను. మా అమ్మ రాజకీయాలకు దూరంగా ఉన్నా అసెంబ్లీ సాక్షిగా అవమానించారు. మీకు ఎలాంటి డౌట్ వద్దు. చట్టపరంగా శిక్షిస్తాం’ అని లోకేశ్ స్పష్టం చేశారు.


