News November 18, 2024
BGTలో అత్యధిక రన్స్ చేసిన ఆటగాళ్లు
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక రన్స్ చేసిన యాక్టివ్ ప్లేయర్లలో పుజారా టాప్లో ఉన్నారు. 24 టెస్టులు ఆడిన ఆయన 2,033 రన్స్ చేశారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా విరాట్ కోహ్లీ (24 టెస్టులు, 1979 రన్స్), స్టీవ్ స్మిత్ (18 T, 1887 R), రహానే (17 T, 1090 R), లబుషేన్ (9 T, 708 R) ఉన్నారు. కాగా పుజారా, రహానే ఈనెల 22 నుంచి జరగనున్న సిరీస్కు ఎంపిక కాలేదన్న విషయం తెలిసిందే.
Similar News
News November 18, 2024
‘వార్-2’ స్పెషల్ సాంగ్లో ఆ హీరోయిన్?
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘వార్-2’లో ఓ స్పెషల్ సాంగ్ ఉంటుందని సినీవర్గాలు తెలిపాయి. ఈ పాటలో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలో ఆమె షూటింగ్లో పాల్గొంటారని సమాచారం. దీనిపై మూవీ టీమ్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. యశ్రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మాణంలో అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ 2025 AUG 14న రిలీజ్ కానుంది.
News November 18, 2024
సమగ్ర కులగణన సర్వే 58.3% పూర్తి
TG: సమగ్ర కులగణన సర్వేను ఈనెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుండగా, ఇప్పటివరకూ 58.3% ఇళ్లలో సర్వే పూర్తయినట్లు అధికారులు తెలిపారు. మరో 10 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశముందన్నారు. రాష్ట్రంలో మొత్తం 1.16కోట్ల ఇళ్లను గుర్తించగా, ఇప్పటివరకూ 67.72 లక్షల ఇళ్లలో సర్వే పూర్తయింది. అత్యధికంగా ములుగు జిల్లాలో 87.1%, నల్గొండలో 81.4%, జనసాంద్రత ఎక్కువగా ఉన్న HYDలో కేవలం 38.3% పూర్తయింది.
News November 18, 2024
టీ అమ్ముకునే వాడంటూ మోదీని అవమానించారు: పవన్
టీ అమ్ముకునే వాడు ప్రధాని అవ్వడమేంటని నరేంద్ర మోదీని కొందరు అవహేళన చేశారని పుణే కంటోన్మెంట్ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ అన్నారు. ‘కొట్టు పెట్టి ఇస్తాం వచ్చి టీ అమ్ముకో’ అని అవమానించారని, అవన్నీ తట్టుకుని ఆయన 3 సార్లు PM అయ్యారని గుర్తుచేశారు. మోదీ మళ్లీ PM అవ్వకూడదని విపక్షాలు ప్రయత్నాలు చేస్తుంటే తాను పట్టుబట్టి APలో BJP, TDPతో కూటమిగా పోటీ చేసి 93% స్ట్రైకింగ్ రేట్తో విజయం సాధించామని తెలిపారు.