News May 5, 2024
నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు

➣AP: ముస్లింలకు 4% రిజర్వేషన్లు కొనసాగిస్తాం: జగన్
➣పేదల భూములు దోచేసే చట్టం LTI: చంద్రబాబు
➣LTI యాక్ట్ ఇంకా రూపకల్పన దశలోనే ఉంది: సజ్జల
➣బూతులు తిట్టేవాళ్లను మోకాళ్లపై కూర్చోబెడతాం: పవన్
➣TG: కేసీఆర్ ఏ కూటమిలో చేరుతారు?: సీఎం రేవంత్
➣గాడిదతో రేవంత్ గుడ్లు పెట్టిస్తున్నారా: కిషన్ రెడ్డి
➣TG: కొత్త జిల్లాలు కొనసాగించాలి.. లేకుంటే ఉద్యమం తప్పదు: కేటీఆర్
➣IPL.. గుజరాత్‌పై బెంగళూరు విజయం
Similar News
News March 13, 2026
BREAKING: అకౌంట్లలో డబ్బులు జమ

AP: ఉగాది కానుకగా PM కిసాన్‌తోపాటు అన్నదాత సుఖీభవ నిధులను CM చంద్రబాబు విడుదల చేశారు. కృష్ణా(D) గన్నవరంలో 46.85 లక్షల మంది అన్నదాతల అకౌంట్లలో రూ.6 వేల చొప్పున జమ చేశారు. వీటిలో పీఎం కిసాన్ నిధులు రూ.2వేలు, అన్నదాత సుఖీభవ కింద రూ.4వేలున్నాయి. మీ అకౌంట్లో డబ్బులు జమ అయ్యాయో లేదో ఇక్కడ <
News March 13, 2026
ఆల్కహాల్ తాగితే నిద్ర పడుతుందా?.. డాక్టర్లు ఏమన్నారంటే!

మద్యం తాగితే త్వరగా నిద్ర పడుతుందని చాలామంది భావిస్తారు. కానీ అది ఒక పెద్ద భ్రమ అంటున్నారు వైద్యులు. ‘ఆల్కహాల్ వల్ల గాఢ నిద్ర తగ్గి, రాత్రివేళ తరచూ మెలకువ వస్తుంది. దీంతో మెదడుకు విశ్రాంతి ఉండదు. గురక & స్లీప్ అప్నియా వంటి శ్వాసకోశ సమస్యలు కూడా పెరుగుతాయి. ఫలితంగా ఉదయం లేవగానే నీరసంగా, అలసటగా ఉంటుంది. కాబట్టి మంచి నిద్ర కోసం మద్యానికి దూరంగా ఉండటమే బెటర్’ అని సూచిస్తున్నారు. SHARE IT
News March 13, 2026
గ్యాస్ దెబ్బ.. పెరిగిన టిఫిన్ల ధరలు!

ఎల్పీజీ కొరత సాకుగా చూపి హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో హోటళ్లు టిఫిన్ల ధరలు పెంచినట్లు తెలుస్తోంది. ప్రతి ఐటమ్‌పై ప్లేట్‌కు రూ.10 పెంచినట్లు వినియోగదారులు చెబుతున్నారు. అయితే ఇది తాత్కాలిక పెంపు మాత్రమేనని యాజమాన్యాలు అంటున్నాయి. ప్రస్తుతం కమర్షియల్ సిలిండర్లు దొరకడం లేదని, ఇటీవల LPG ధర కూడా పెరగడంతో నిర్వహణ ఖర్చులు ఎక్కువైనట్లు పేర్కొంటున్నాయి. మరి మీ ఏరియాలోనూ టిఫిన్ల ధరలు పెరిగాయా? COMMENT


