News February 21, 2025
బిడ్డను కోల్పోయిన తల్లులకు 60రోజుల సెలవు: హిమాచల్

ప్రభుత్వోద్యోగం చేసేవారిలో చనిపోయిన బిడ్డకు జన్మనిచ్చిన లేదా పుట్టిన బిడ్డ చనిపోయిన తల్లులకు మాతృత్వ సెలవుల్ని 60 రోజుల పాటు ఇవ్వనున్నట్లు హిమాచల్ ప్రదేశ్ ప్రకటించింది. ఇప్పటికే ఉన్న మెటర్నిటీ లీవ్ నిబంధనలే ఈ సెలవులకూ వర్తిస్తాయని పేర్కొంది. అటు పీజీ చదువుతున్న ఎంబీబీఎస్ వైద్యులకు పూర్తి జీతాన్ని ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది.
Similar News
News December 10, 2025
వణుకుతున్న కర్నూలు, నంద్యాల జిల్లా ప్రజలు

ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలను చలి వణికిస్తోంది. ఇప్పటికే ఉష్ణోగ్రతలు 15-16 డిగ్రీలకు పడిపోయాయి. ఉదయం 9 గంటలైనా చలి తగ్గడం లేదు. దీనికి తోడు మంచు కూడా కురుస్తోంది. ఈనెల 11 నుంచి చలి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల వరకు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 16-17 డిగ్రీల వరకు నమోదవుతాయని తెలిపారు. చలిని తట్టుకోలేక చలిమంటలు వేసుకుంటున్నారు.
News December 10, 2025
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీలో ఉద్యోగాలు

<
News December 10, 2025
నానో ఎరువులను ఎలా వాడాలి?

నానో యూరియా, DAPలను పైరుపై పిచికారీ పద్ధతిలోనే వాడాలి. వీటిని భూమిలో, డ్రిప్లలో వాడకూడదు. పంటలకు దుక్కిలో వ్యవసాయ నిపుణులు సిఫార్సు చేసిన ఎరువులను యథావిధిగా వేయాలి. పంటకు పైన ఎరువులను సిఫార్సు చేసినప్పుడు మాత్రం.. నానో ఎరువుల రూపంలో పిచికారీ చేసుకోవాలి. నానో యూరియా, DAPలను ఎకరాకు అర లీటరు(లీటరు నీటికి 4ml)చొప్పున పిచికారీ చేయాలి. తర్వాత సంప్రదాయ యూరియా, DAPలను పంటకు వేయనవసరం లేదు.


