News August 29, 2024

మమత వ్యాఖ్యలపై హిమంత ఫైర్

image

బెంగాల్ తగలబడితే అస్సాం, ఢిల్లీలో కూడా అవే పరిస్థితులు వస్తాయన్న సీఎం మమతా బెనర్జీ <<13961413>>వ్యాఖ్యలపై<<>> అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ తీవ్రంగా స్పందించారు. ‘దీదీ.. అస్సాంనే బెదిరించడానికి మీకెంత ధైర్యం? మీ కోపం మాపై ప్రదర్శించకండి. రాజకీయ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు దేశాన్ని తగలబెట్టాలని చూడకండి’ అని ధ్వజమెత్తారు. కోల్‌కతా హత్యాచార ఘటన నేపథ్యంలో బెంగాల్‌ను BJP తగలబెట్టాలని చూస్తోందని దీదీ ఆరోపించారు.

Similar News

News December 13, 2025

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

image

<>స్పోర్ట్స్ <<>>అథారిటీ ఆఫ్ ఇండియా 11 చీఫ్ కోచ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు జనవరి 11 వరకు అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా లేదా ఒలింపిక్స్ /పారాలింపిక్స్/ అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో పాల్గొన్నవారు, ద్రోణాచార్య అవార్డు గ్రహీతలు దరఖాస్తుకు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 64ఏళ్లు. వెబ్‌సైట్: https://sportsauthorityofindia.nic.in

News December 13, 2025

బిగ్‌బాస్.. సుమన్ శెట్టి ఎలిమినేట్!

image

బిగ్ బాస్ తెలుగు సీజన్-9లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగే అవకాశం ఉంది. సీజన్ ఇంకో వారమే మిగిలుంది కాబట్టి హౌస్‌లో ఉన్న ఏడుగురు సభ్యుల్లో ఇద్దరిని ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది. శనివారం ఎపిసోడ్‌లో సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే ఆదివారం ఎపిసోడ్‌లో సంజన/భరణి/డెమోన్ పవన్‌లో ఒకరు ఎలిమినేటయ్యే ఛాన్సులున్నాయని SMలో పోస్టులు వైరలవుతున్నాయి.

News December 13, 2025

బేబీ మసాజ్‌కు బెస్ట్ ఆయిల్స్ ఇవే..

image

పిల్లల సంపూర్ణ వికాసానికి తల్లిపాలు ఎంత అవసరమో వారి ఆరోగ్యానికి శరీర మర్దన కూడా అంతే అవసరం. అయితే దీనికోసం ప్లాంట్ ఆయిల్, కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, నువ్వుల నూనె, ఆవ నూనె వాడటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. శరీరం మీద ఎటువంటి రాషెస్ దద్దుర్లు ఉన్నా కూడా ఈ ఆయిల్ మసాజ్ వల్ల నివారించొచ్చంటున్నారు. బేబీకి ఆయిల్ మసాజ్ చేసేటప్పుడు చేతికి ఎలాంటి ఆభరణాలు ఉండకుండా చూసుకోవాలి.