News February 27, 2025
ఉత్తరాదిన 25 భాషలను మింగేసిన హిందీ: స్టాలిన్

ఉత్తరాదిన 25 భాషలను హిందీ మింగేసిందని TN CM స్టాలిన్ ఆరోపించారు. ‘హిందీ ఒత్తిడి ప్రాచీన మాతృభాషలను చంపేసింది. UP, బిహార్ హిందీ హార్ట్ ల్యాండ్స్ కావు. వాటి అసలైన భాషలు ఇప్పుడు గతించిపోయాయి. భోజ్‌పురి, మైథిలీ, అవధి, బ్రాజ్, బుందేలి, గర్హ్‌వలి, కుమోని, మాగహి, మార్వాడి, మాల్వి, ఛత్తీస్‌గడి, సంతాలి, ఆంగిక, హో, ఖరియా, ఖోర్తా, కుర్మాలి, కురుఖ్, ముండారి వంటి భాషలు ఉనికి కోసం పోరాడుతున్నాయ’ని అన్నారు.
Similar News
News February 27, 2025
గ్రూప్-2 మెయిన్స్: అభ్యంతరాల గడువు పొడిగింపు

AP: గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలో ప్రశ్నలు, కీపై అభ్యంతరాలు తెలిపేందుకు గడువును APPSC రేపటి వరకు పొడిగించింది. ఆన్‌లైన్‌లో మాత్రమే స్వీకరిస్తామని, పోస్ట్, ఫోన్, SMS, వాట్సాప్ ద్వారా పంపితే పరిగణించబోమని స్పష్టం చేసింది. అనేక వివాదాలు, ఆందోళనల నడుమ ఈ నెల 23న జరిగిన పరీక్షకు 79,599 మంది హాజరైన విషయం తెలిసిందే. అదే రోజు ప్రాథమిక కీని కమిషన్ విడుదల చేసింది.
వెబ్‌సైట్: https://portal-psc.ap.gov.in/
News February 27, 2025
14 నెలల పాలనలో 4 ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి: హరీశ్ రావు

TG: రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులను కాపాడలేని దుస్థితిలో INC ప్రభుత్వం ఉందని BRS MLA హరీశ్ రావు మండిపడ్డారు. కృష్ణా జలాలను AP తరలించుకుపోతుంటే చోద్యం చూస్తోందని దుయ్యబట్టారు. గోదావరిపై బనకచర్ల ప్రాజెక్టు నిర్మిస్తుంటే నోరెత్తడం లేదని ఫైరయ్యారు. SLBC టన్నెల్ వద్ద ఆయన మాట్లాడుతూ ‘కాంగ్రెస్ 14 నెలల పాలనలో 4 ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి. SLBC వద్ద శిథిలాల తొలగింపులో వేగం పెంచాలి’ అని పేర్కొన్నారు.
News February 27, 2025
పాకిస్థాన్, బంగ్లాదేశ్ మ్యాచ్ రద్దు

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. టాస్ కూడా పడకముందే వర్షం ఆరంభమైంది. ఎంతకీ వాన తగ్గకపోవడంతో ఆటను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. కాగా ఈ టోర్నీలో పాక్, బంగ్లా జట్లు ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడాయి. దీంతో ఇరు జట్లు ఒక్క విజయం కూడా నమోదు చేయకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించాయి.