News September 14, 2025

ఇతర భాషలకు హిందీ శత్రువు కాదు.. మిత్రుడు: అమిత్ షా

image

దేశంలో హిందీ భాషను ఇతర భాషలకు ముప్పుగా చూడొద్దని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. హిందీ ఇతర భాషలకు శత్రువు కాదని, మిత్రుడు అని హిందీ దివస్ కార్యక్రమంలో ఆయన చెప్పారు. ‘ఇందుకు గుజరాత్ పెద్ద ఉదాహరణ. ఇక్కడ గుజరాతీ మాట్లాడిన గాంధీ, దయానంద, వల్లభాయ్ పటేల్, KM మున్షి వంటి ఉద్ధండులు హిందీని ప్రోత్సహించారు. వందేమాతరం, జైహింద్ లాంటి నినాదాలు భాషా మేల్కొలుపు నుంచే ఉద్భవించాయి’ అని వ్యాఖ్యానించారు.

Similar News

News February 16, 2026

ఉపవాసం తర్వాత ఇలా చేయండి

image

శివరాత్రికి కఠిన ఉపవాసం పాటించిన వారు నీరసంగా ఉంటారు. ఉపవాసం తర్వాత ఖాళీ కడుపుతో భారీగా ఫుడ్ తింటే అనారోగ్యానికి దారి తీయొచ్చు. మెత్తగా వండిన అన్నం, పప్పు, కూరగాయాలు, చిలగడదుంప, పెరుగన్నం వంటి సాత్విక ఆహారం తీసుకోవాలి. నూనె, ఉప్పు, కారం అధికంగా ఉన్న ఆహారాన్ని తినరాదు. వీటిని తీసుకుంటే కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు రావొచ్చు.

News February 16, 2026

మేఘా అనుబంధ సంస్థలో చేరిన లక్ష్మీనారాయణ

image

IPS మాజీ అధికారి, CBI మాజీ జేడీ లక్ష్మీనారాయణ మేఘా ఇంజినీరింగ్ అనుబంధ సంస్థ ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో చేరారు. ఈ సంస్థ ఒలెక్ట్రా పేరుతో ఎలక్ట్రిక్ బస్సులను తయారు చేస్తుంది. ఉద్యోగానికి రిజైన్ చేసిన ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించగా పెద్దగా కలిసిరాలేదు. 2019లో జనసేన తరఫున విశాఖ MP అభ్యర్థిగా పోటీ చేసి ఓడారు. ఈ నేపథ్యంలోనే పాలిటిక్స్‌కు స్వస్తి చెప్పి ఉద్యోగంలో చేరినట్లు తెలుస్తోంది.

News February 16, 2026

విమానంలో ఇలా పాటలు వింటే అంతే..

image

విమానాల్లో ఇయర్‌ఫోన్స్ వాడకుండా పెద్ద శబ్దంతో పాటలు వినేవారిపై చర్యలు తప్పవని కేంద్రమంత్రి మురళీధర్ మోహోల్ హెచ్చరించారు. ఇలాంటివారిని అన్‌రూలీ ప్యాసెంజర్‌గా ట్రీట్ చేసి విమానం నుంచి దించేయడం/భవిష్యత్తులో ప్రయాణించకుండా బ్యాన్ చేసే ఆస్కారముందన్నారు. 1937 ఎయిర్‌క్రాఫ్ట్ రూల్స్ మేరకు అనుమతి లేకుండా ఎయిర్‌పోర్టుల్లో, ఫ్లైట్‌లో ఫొటోలు తీయడం నిబంధనలకు విరుద్ధమని లోక్‌సభలో ఓ MP ప్రశ్నకు సమాధానమిచ్చారు.