News April 14, 2025

ఇంగ్లిష్ పుస్తకాలకు హిందీ పేర్లు.. NCERT వివాదాస్పద నిర్ణయం

image

ఇంగ్లిష్ పుస్తకాలకు NCERT హిందీ పేర్లు పెట్టడం వివాదాస్పదమైంది. గతంలో 6వ తరగతి టెక్ట్స్‌బుక్ పేరు ఇంగ్లిష్‌లో ‘Honeysuckle’ అని ఉండగా హిందీలో ‘పూర్వీ’ అని మార్చింది. ఇది సంగీత రాగం పేరు. 1,2 తరగతుల పుస్తకాలకు మృదంగ్, 3rd క్లాస్ బుక్స్‌కు సంతూర్ అని పేర్లు పెట్టింది. ఇవి సంగీత పరికరాలు. తమిళనాడు హిందీ భాషను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వేళ NCERT పేర్లను మార్చడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.

Similar News

News April 16, 2025

KKR ఓటమికి అతడే కారణమంటూ ఫ్యాన్స్ ఫైర్

image

పంజాబ్‌తో మ్యాచ్‌లో KKR ఓటమికి ఆ జట్టు కెప్టెన్ రహానేనే కారణమని ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. చాహల్ బౌలింగ్‌లో స్వీప్ ఆడబోయిన అతను LBWగా వెనుదిరిగారు. తర్వాత రిప్లేలో బాల్ వికెట్లను మిస్ అయినట్లు కనిపించింది. రివ్యూ తీసుకొని ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదని ఆ జట్టు అభిమానులు పోస్టులు పెడుతున్నారు. మరోవైపు, ఓటమికి పూర్తి బాధ్యత తనదే అని, కెప్టెన్‌గా మంచి నాక్ ఆడాల్సిందని మ్యాచ్ అనంతరం రహానే తెలిపారు.

News April 16, 2025

ఈరోజు నమాజ్ వేళలు(ఏప్రిల్ 16, బుధవారం)

image

ఫజర్: తెల్లవారుజామున 4.45 గంటలకు సూర్యోదయం: ఉదయం 6.00 గంటలకు దుహర్: మధ్యాహ్నం 12.16 గంటలకు అసర్: సాయంత్రం 4.42 గంటలకు మఘ్రిబ్: సాయంత్రం 6.32 గంటలకు ఇష: రాత్రి 7.47 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News April 16, 2025

శుభ ముహూర్తం (16-04-2025)(బుధవారం)

image

తిథి: బహుళ తదియ ఉ.10.24 వరకు తదుపరి చవితి.. నక్షత్రం: అనురాధ తె.3.09వరకు తదుపరి జ్యేష్ట.. శుభ సమయం: ఉ.9.48 నుంచి 10.12 వరకు తిరిగి సా.7.12 నుంచి 7.42 వరకు.. రాహుకాలం: ప.12.00-1.30 వరకు.. యమగండం: ఉ.7.30-9.00 వరకు దుర్ముహూర్తం: ఉ.11.36-12.24 వరకు.. వర్జ్యం: శే.తె.6.57 వరకు పున: వర్జ్యం లేదు అమృత ఘడియలు: మ.3.42 నుంచి 5.26 వరకు

error: Content is protected !!