News November 19, 2024
TTDలో ఇక హిందూ ఉద్యోగులే..
AP: టీటీడీలో 7వేల మంది పర్మనెంట్ ఉద్యోగులు ఉండగా అందులో 300 మంది అన్యమతస్థులు (హిందువులు కాని వారు) ఉన్నారు. తాజాగా బోర్డు తీసుకున్న నిర్ణయం ప్రకారం వీరిని ఇతర ప్రభుత్వ శాఖల్లోకి పంపుతారు. లేదంటే స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(5) సమ్మతిస్తుంది. కాగా టీటీడీలో హిందువులే ఉద్యోగులుగా ఉండాలని ఎప్పటినుంచో డిమాండ్ వినిపిస్తోంది. TTD తాజా నిర్ణయంపై మీ కామెంట్?
Similar News
News November 19, 2024
జీవో 16తో ఎంతమంది రెగ్యులరైజ్ అయ్యారంటే?
TG:కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ గత ప్రభుత్వం ఇచ్చిన GO 16ను <<14652442>>హైకోర్టు <<>>కొట్టేసింది. ఈ GO ప్రకారం మొత్తం 5,544 మంది రెగ్యులరైజ్ కాగా ఇందులో 2909 మంది జూనియర్ లెక్చరర్లు, 184 మంది ఒకేషనల్ లెక్చరర్లు, 390 మంది పాలిటెక్నిక్, 270మంది డిగ్రీ కాలేజీ లెక్చరర్లు కాగా, టెక్నికల్ విద్యాశాఖలో 131 మంది, మెడికల్లో 837 మంది, 179 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, మిగతావారు ఫార్మాసిస్టులు, సహాయకులు ఉన్నారు.
News November 19, 2024
అంధుల వరల్డ్ కప్నుంచి వైదొలగిన టీమ్ ఇండియా
పాకిస్థాన్లో ఈ నెల 23 నుంచి వచ్చే నెల 3 వరకు జరిగే అంధుల టీ20 క్రికెట్ వరల్డ్ కప్ నుంచి డిఫెండింగ్ ఛాంపియన్ టీమ్ ఇండియా తప్పుకొంది. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత అంధుల క్రికెట్ అసోసియేషన్(IBCA) ప్రధాన కార్యదర్శి శైలేంద్ర యాదవ్ తెలిపారు. తమతో పాటు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు కూడా పాక్కు వెళ్లడం లేదని వెల్లడించారు.
News November 19, 2024
రేప్ కేసులపై FBలో ఫిర్యాదు: సుప్రీంకోర్టు కీలక ప్రశ్న
మలయాళ నటుడు <<14650875>>సిద్ధిఖ్<<>> రేప్ కేసు విచారణలో SC వ్యాఖ్యలు చర్చనీయంగా అయ్యాయి. 2016లో సిద్ధిఖ్ తనపై లైంగిక దాడి చేశారని ఓ మహిళ మీటూ ఉద్యమం టైమ్లో FBలో రాసుకొచ్చారు. తర్వాత FIR ఫైల్ అయింది. ‘FBలో రాయడానికి ధైర్యమున్నప్పుడు ఎనిమిదేళ్లుగా పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు’ అని కోర్టు ప్రశ్నించింది. కొన్ని కేసుల్లో భయపడి ఫిర్యాదు చేయకపోవడం, కొన్నింట్లో కావాలనే ఇరికిస్తుండటంతో వ్యాఖ్యలపై చర్చ జరుగుతోంది.