News April 13, 2025
బెంగాల్లో హిందువులకు రక్షణ లేదు: BJP

బెంగాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీనిపై ఆ రాష్ట్ర LOP, BJP నేత సువేందు అధికారి స్పందిస్తూ రాష్ట్రంలో హిందువులకు రక్షణ లేదని వ్యాఖ్యానించారు. ఇది సీఎం మమత చేతకానితనానికి నిదర్శనమని బీజేపీ రాష్ట్ర చీఫ్ మజూందార్ విమర్శించారు. కాగా ముర్షీదాబాద్ సహా పలు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు, బీఎస్ఎఫ్ జవాన్లు పహారా కాస్తున్నారు. అల్లర్ల ఘటనకు సంబంధించి ఇప్పటివరకు 150 మందిని అరెస్టు చేశారు.
Similar News
News April 14, 2025
రెవెన్యూ సిబ్బందిని విశ్వసిస్తున్నాం: రేవంత్

TG: రెవెన్యూ సిబ్బందిని దోషులుగా చూసే విధానానికి తమ ప్రభుత్వం వ్యతిరేకమని సీఎం రేవంత్ తెలిపారు. కొందరి వల్ల మొత్తం రెవెన్యూ శాఖను దోషిగా తాను చూడనని, పూర్తిగా విశ్వసిస్తున్నట్లు వెల్లడించారు. రైతుల కోసం చాలామంది రెవెన్యూ ఉద్యోగులు అహర్నిశలు కృషి చేశారని గుర్తుచేశారు. ప్రభుత్వం, అధికారులు వేర్వేరు కాదని, ఇద్దరూ కలిసి నడిస్తే ఏదైనా విజయవంతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
News April 14, 2025
మంత్రి పదవి కోసం పార్టీలోకి రాలేదు: వివేక్

TG: మంత్రి పదవి కోసం తాము కాంగ్రెస్‌లోకి వచ్చినట్లు MLA ప్రేమ్‌సాగర్ చేసిన వ్యాఖ్యలపై MLA గడ్డం వివేక్ స్పందించారు. ‘ఘర్ వాపసీ అంటూ రాహుల్ గాంధీ ఆహ్వానిస్తే వచ్చాం. పలు స్థానాలు గెలవడంలో కీలక పాత్ర పోషించాం. బీజేపీలో ఉంటే కేంద్రమంత్రి పదవి వచ్చేది. మంత్రి పదవి అనేది అధిష్ఠానం నిర్ణయిస్తుంది. ఎవరో మాట్లాడితే మాకొచ్చే నష్టం లేదు. మా కుటుంబమే ఒక బ్రాండ్’ అని వ్యాఖ్యానించారు.
News April 14, 2025
‘భూభారతి’తో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం: రేవంత్ రెడ్డి

TG: 69 లక్షల కుటుంబాల రైతులకు భూభారతి చట్టాన్ని అంకితం చేస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో జరిగిన పోరాటాలన్నీ భూముల కోసమేనన్నారు. గత ప్రభుత్వం తెచ్చిన ‘ధరణి’తో రెవెన్యూ అధికారులపై దాడులు జరిగాయన్నారు. ఎంతో మంది భూములు కోల్పోయారన్నారు. ధరణిని బంగాళాఖాతంలో విసిరేస్తామని ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నామని స్పష్టం చేశారు. భూభారతితో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు.