News February 27, 2025

Gold Cardతో భారతీయుల్ని నియమించుకోండి: ట్రంప్ ఆఫర్

image

US వర్సిటీల్లో గ్రాడ్యుయేట్లు అయ్యే భారతీయులను అమెరికన్ కంపెనీలు ఇకపై ‘గోల్డ్ కార్డు’ కింద నియమించుకోవచ్చని Prez డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ‘భారత్, చైనా సహా వేర్వేరు దేశాల నుంచి హార్వర్డ్ వంటి వర్సిటీలకు స్టూడెంట్స్ వస్తున్నారు. టాపర్లుగా అవతరించి జాబ్ ఆఫర్లు కొట్టేస్తున్నారు. వారు దేశంలో ఉంటారో లేదో తెలీదు కాబట్టి వెంటనే రిజెక్ట్ చేస్తున్నారు. గోల్డ్ కార్డుతో ఆ ఇబ్బంది తొలగిపోతుంది’ అని అన్నారు.

Similar News

News February 27, 2025

ఆర్టీసీలో ఏమైనా పొగొట్టుకున్నారా ? ఈ నంబర్‌కు కాల్ చేయండి

image

TG: ఆర్టీసీ టికెట్‌పై రాసిన చిల్లర తీసుకోకుండా మర్చిపోయారా? ఏం ఫర్వాలేదు. టోల్ ఫ్రీ నంబర్ 040-69440000 కాల్ చేసి మీరు ప్రయాణించిన బస్సు, టికెట్ వివరాలు చెబితే ఆ డబ్బులను RTC మీకు ఫోన్‌పే ద్వారా అందిస్తుంది. అంతేకాకుండా మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు మధ్యలో బస్సు మిస్సైనా అదే టికెట్‌పై మరో బస్సులో గమ్యానికి చేరవచ్చు. ఏవైనా వస్తువులు పొగొట్టుకున్నాటోల్ ఫ్రీ నంబరుకు కాల్ చేసి వాటిని పొందొచ్చు.

News February 27, 2025

ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్‌గా పీటర్సన్

image

ఐపీఎల్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్‌గా ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్‌ను ఆ ఫ్రాంచైజీ నియమించింది. త్వరలోనే ఆయన జట్టులో చేరనున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించింది. కాగా పీటర్సన్ 2009 నుంచి 2016 వరకు ఐపీఎల్‌లో ఆడారు. ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించారు. అప్పటి నుంచే జట్టు ఓనర్ గ్రంధి కిరణ్‌కుమార్‌తో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

News February 27, 2025

ఇళ్ల నిర్మాణంపై కీలక ఉత్తర్వులు

image

APలో అక్రమ నిర్మాణాలకు సంబంధించి మున్సిపల్ శాఖ గైడ్‌లైన్స్ ఇచ్చింది. ఆక్యుపేషన్ సర్టిఫికెట్‌పై భవన యజమానుల వద్ద అండర్ టేకింగ్ తీసుకోవాలంది. ఎప్పటికప్పుడు అధికారులు బిల్డింగ్ ప్లాన్, నిర్మాణాలు తనిఖీ చేయాలని స్పష్టం చేసింది. ప్లాన్ మేరకు నిర్మాణం లేకపోతే నివాసయోగ్య పత్రం జారీ చేయకూడదని పేర్కొంది. ఆ పత్రం లేకపోతే తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ కనెక్షన్లు, బ్యాంకులు రుణాలు ఇవ్వొద్దని తేల్చి చెప్పింది.

error: Content is protected !!