News May 13, 2024
భారతీయ పైలట్లను నియమించుకుంటాం: మాల్దీవులు

తమకు భారత్ విరాళమిచ్చిన రెండు హెలికాప్టర్లు, ఒక డోర్నియర్ విమానాన్ని నడిపేందుకు భారతీయ పైలట్లనే నియమించుకుంటామని మాల్దీవుల రక్షణ మంత్రి ఘాసన్ మౌమూన్ తెలిపారు. ‘వాటిని నడిపే సామర్థ్యం మా పైలట్లకు లేదు. గతంలో కొంతమంది శిక్షణ తీసుకున్నా అది పూర్తి స్థాయిలో జరగలేదు’ అని వివరించారు. దేశాధ్యక్షుడిగా ముయిజ్జు ఎన్నికైన తర్వాత మాల్దీవుల విదేశీ విధానం భారత్‌కు వ్యతిరేకంగా మారిన సంగతి తెలిసిందే.
Similar News
News February 13, 2026
JIPMERలో జూనియర్ రెసిడెంట్ పోస్టులు

<
News February 13, 2026
అదృష్టం వరించింది.. టాస్‌తో గెలిచారు

TG: దుబ్బాక మున్సిపాలిటీ ఎన్నికల్లో మూడో వార్డు కౌంటింగులో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. BRS అభ్యర్థి కంకణాల ఎల్లవ్వ, బీజేపీ అభ్యర్థి శ్రీలత మధ్య చివరి వరకు తీవ్ర పోటీ నెలకొంది. ఇద్దరికి సమానంగా ఓట్లు వచ్చాయి. రీకౌంటింగ్ చేసినా ఫలితం మారలేదు. దీంతో అభ్యర్థుల సమ్మతితో టాస్ వేయగా ఎల్లవ్వను అదృష్టం వరించింది. దీంతో ఆమెను విజేతగా ప్రకటించారు.
News February 13, 2026
పిల్లల్లో మలబద్ధకానికి కారణాలివే..

పిల్లల్లో మలబద్ధకానికి ఎన్నో కారణాలుంటాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా తగినంత ఫైబర్, నీరు తీసుకోకపోవడం వల్ల ఈ సమస్య వస్తుందంటున్నారు. IBS సమస్య ఉన్న చిన్నారుల్లో కూడా మలబద్ధకం కామన్‌గా కనిపిస్తుంది. ప్రయాణాలు, క్రమరహిత భోజన సమయాలు, జీవనశైలిలో తీవ్రమైన మార్పులు జీర్ణవ్యవస్థను ఇబ్బంది పెడతాయి. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల్లో అసౌకర్యాన్ని ఎప్పటికప్పుడు గమనించాలని సూచిస్తున్నారు.


