News April 18, 2025
అతడి ప్రశాంతత వల్ల మాపై ఒత్తిడి తగ్గింది: భువనేశ్వర్

RCB కెప్టెన్ రజత్ పాటీదార్ నాయకత్వ బాధ్యతల్ని అద్భుతంగా నిర్వర్తిస్తున్నారని ఆ జట్టు బౌలర్ భువనేశ్వర్ కొనియాడారు. ‘రజత్ చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఈ ఫార్మాట్‌లో అలా ఉండటం చాలా కీలకం. కొంతమంది ఒక మ్యాచ్ కోల్పోగానే టెన్షన్ పడిపోతారు. కానీ రజత్ జయాపజయాల్ని సమానంగా తీసుకుంటాడు. ఓడినప్పుడు ఎలా ఉన్నాడో, గెలిచినప్పుడూ అలాగే ఉన్నాడు. అతడి ప్రశాంతత కారణంగా మాపై ఒత్తిడి తగ్గింది’ అని తెలిపారు.
Similar News
News April 19, 2025
పెళ్లిపై నాకు నమ్మకం లేదు: త్రిష

వివాహ వ్యవస్థపై తనకు నమ్మకం లేదని హీరోయిన్ త్రిష అన్నారు. పెళ్లి అయినా, కాకపోయినా తనకు ఫరవాలేదని ఆమె తేల్చి చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో పెళ్లిపై ఎదురైన ప్రశ్నకు ఆమె ఇలా సమాధానమిచ్చారు. కాగా త్రిష ప్రస్తుతం కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ‘థగ్ లైఫ్’ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన ‘విశ్వంభర’లోనూ ఆమె కనిపించనున్నారు.
News April 19, 2025
మామిడి పండ్లు తింటున్నారా?

వేసవి వచ్చిందంటే ముందుగా గుర్తుచ్చేది మామిడి పండ్లే. అయితే, కార్బైడ్‌తో మాగించిన పండ్లను తింటే అనేక వ్యాధులు, ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వాటిని ముందుగా ఉప్పు కలిపిన నీటిలో 15-20 నిమిషాలు ఉంచిన తర్వాత మంచినీటితో కడిగి, ఆపై తుడిచి తినాలని సూచిస్తున్నారు. సాధ్యమైనంత వరకు తొక్కను తినకపోవడమే బెటర్ అని చెబుతున్నారు. కొనేటప్పుడే జాగ్రత్తలు తీసుకుంటే మరీ మంచిదంటున్నారు.
News April 19, 2025
2వేల మందిపై ఇవే చర్యలుంటాయా?: IAS స్మితా

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో AI ఎడిటెడ్ ఫొటోను రీట్వీట్ చేసినందుకు పోలీసులిచ్చిన <<16116901>>నోటీసులపై<<>> IAS స్మితా సబర్వాల్ స్పందించారు. ఇవాళ పోలీసులకు తన స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు ఆమె ట్వీట్ చేశారు. ‘ఈ పోస్టును షేర్ చేసిన 2వేల మందిపై ఒకే విధమైన చర్యలుంటాయా? అలా చేయకపోతే కొంతమందినే టార్గెట్ చేసినట్లు అవుతుంది. అప్పుడు చట్టంముందు అందరూ సమానులే అన్న సూత్రం రాజీపడినట్లవుతుంది’ అని రాసుకొచ్చారు.