News August 12, 2024

ఆయనది ఆత్మహత్య: ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్ కుటుంబం

image

ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్ గ్రాహం థోర్ప్‌ది సహజ మరణం కాదని ఆయన కుటుంబం వెల్లడించింది. డిప్రెషన్, ఆందోళన కారణంగా బలవన్మరణానికి పాల్పడ్డారని పేర్కొంది. ఇంగ్లండ్ తరఫున 100 టెస్టులాడిన గ్రాహం ఈ నెల 5న కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఆయన చనిపోయారని అందరూ అనుకున్నారు. హెల్త్ బాగాలేకపోవడంతో కుటుంబానికి భారంగా మారానని బాధపడుతూ ఉండేవారని థోర్ప్ భార్య తెలిపారు. ఆ బాధతోనే సూసైడ్ చేసుకున్నారని వివరించారు.

Similar News

News November 21, 2025

వరంగల్: కలెక్టర్‌కు ఎమ్మెల్సీ సారయ్య శుభాకాంక్షలు

image

దక్షిణ భారతదేశంలో జల సంరక్షణ కేటగిరి-2లో వరంగల్ జిల్లాకు మొదటి స్థానం దక్కిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం MLC బసవరాజు సారయ్య వరంగల్ జిల్లా కలెక్టర్ డా.సత్య శారదను అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలో జల సంరక్షణ చర్యలను విజయవంతంగా చేపట్టి రాష్ట్రానికి ప్రతిష్ఠ తెచ్చారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో 20వ డివిజన్ కార్పొరేటర్ గుండెటి నరేంద్ర కుమార్ తదితరులు ఉన్నారు.

News November 21, 2025

టార్గెట్ 1 రన్.. భారత్ ఘోర ఓటమి

image

ACC మెన్స్ ఆసియా రైజింగ్ స్టార్స్ టోర్నీ <<18351488>>సెమీస్‌లో<<>> బంగ్లా-Aతో జరిగిన మ్యాచులో భారత్-A చిత్తుగా ఓడిపోయింది. మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీయగా మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా సున్నాకే 2 వికెట్లు కోల్పోయింది. ఒక పరుగు టార్గెట్‌తో బరిలోకి దిగిన బంగ్లా తొలి బంతికి వికెట్ కోల్పోయింది. తర్వాతి బంతిని బౌలర్ సుయాష్ శర్మ వైడ్ వేయడంతో బంగ్లా గెలిచింది. ఈ ఓటమితో భారత్-A జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది.

News November 21, 2025

కొత్త లేబర్ కోడ్‌లో ఉపయోగాలు ఇవే..

image

* వారానికి 48 గంటల పని, ఓవర్ టైమ్ వర్క్ చేస్తే రెట్టింపు వేతనం
* కార్మికులకు తప్పనిసరిగా అపాయింట్‌మెంట్ లెటర్లు
* ఫిక్స్‌ట్-టర్మ్ ఎంప్లాయిమెంట్ ద్వారా కాంట్రాక్ట్ వర్కర్లకు భద్రత, పర్మనెంట్ ఉద్యోగుల మాదిరి చట్టపరణమైన రక్షణ
* అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సామాజిక న్యాయం
* భూగర్భ మైనింగ్, భారీ యంత్రాల వంటి పనులకూ మహిళలకు అనుమతి