News August 20, 2024
ఆయనది చిన్న పిల్లాడి మనస్తత్వం: బాబీ డియోల్
సీనియర్ హీరో బాలకృష్ణతో పనిచేయడం ఎప్పటికీ మరిచిపోలేనని యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ అన్నారు. ఆయనది చిన్న పిల్లాడి మనస్తత్వమని అన్నారు. సెట్‌లో చాలా ఎనర్జిటిక్‌గా ఉంటారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇలాంటి అద్భుతమైన వ్యక్తులతో పనిచేసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. కాగా బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతోన్న NBK109లో బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్నారు.
Similar News
News January 24, 2025
నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త
TG: ప్రైవేటు ఉద్యోగ వేటలో ఉన్న నిరుద్యోగుల కోసం ప్రభుత్వం ‘డీట్’ యాప్ తెచ్చింది. AIతో పనిచేసే దీన్ని డౌన్‌లోడ్ చేసుకుని విద్యార్హత, స్కిల్స్ ఎంటర్ చేస్తే రెజ్యుమే తయారవుతుంది. పార్ట్‌టైమ్, ఫుల్‌టైమ్, వర్క్ ఫ్రం హోంతో పాటు ఇంటర్న్‌షిప్ ఆప్షన్స్ ఉంటాయి. ఐటీ, ఆటోమొబైల్స్, ఫార్మా, ఎడ్యుకేషన్, హెల్త్‌కేర్ తదితర కంపెనీలు ఇందులో రిజిస్టరై ఉండగా వాటికి కావాల్సినవారి రెజ్యుమేలను యాప్ రిఫర్ చేస్తుంది.
News January 24, 2025
రీ సర్వేపై సందేహాలా? ఈ నంబర్‌కు ఫోన్ చేయండి
APలో భూముల రీసర్వే పైలట్ ప్రాజెక్టు అమలవుతున్న నేపథ్యంలో రైతుల సందేహాల నివృత్తికై ప్రభుత్వం హెల్ప్‌లైన్ నంబర్‌ను ప్రారంభించింది. ఉ.10 నుంచి సా.5.30 వరకు 8143679222 నంబర్‌కు ఫోన్ చేసి సందేహాలు, సమస్యలు తెలియజేయవచ్చని సూచించింది. రీసర్వే సందర్భంగా యజమానులు భూమి వద్దకు వచ్చి హద్దులు చూపించేందుకు 3సార్లు అవకాశం ఉంటుందని, అయినా రాకపోతే వీడియో కాల్ ద్వారా హద్దులు ఖరారు చేస్తామని అధికారులు తెలిపారు.
News January 24, 2025
ముగిసిన TG CM రేవంత్ దావోస్ పర్యటన
దావోస్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ముగిసింది. అక్కడ జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సు-2025లో పాల్గొన్న ఆయన ఈ ఉదయం 10.30 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులే లక్ష్యంగా రేవంత్ బృందం దావోస్ పర్యటన సాగింది. ఈ సందర్భంగా సీఎంకు స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ శ్రేణులు విమానాశ్రయానికి వెళ్లనున్నాయి.