News October 14, 2025
రాష్ట్రానికి చరిత్రాత్మకమైన రోజు: మంత్రి లోకేశ్

AP: విశాఖలో గూగుల్ అడుగుపెట్టడం సంతోషంగా ఉందని, ఇది రాష్ట్రానికి చరిత్రాత్మకమైన రోజు అని మంత్రి లోకేశ్ అభివర్ణించారు. ఇది గ్లోబల్ టెక్ మ్యాప్‌పై APని బలంగా నిలబెట్టే మైలురాయి అవుతుందన్నారు. ఢిల్లీలో గూగుల్‌తో ఒప్పంద కార్యక్రమంలో మాట్లాడారు. కేంద్రం సహకారం, విజనరీ లీడర్ CBN నాయకత్వంలో రాష్ట్రానికి మరిన్ని ప్రాజెక్టులు రాబోతున్నాయని చెప్పారు. డిజిటల్ హబ్‌గా దేశానికి మంచి గుర్తింపు లభిస్తుందన్నారు.
Similar News
News October 14, 2025
ఆతిథ్యమిస్తున్నందుకు ఏపీ గర్విస్తోంది: మంత్రి అనిత

‘క్రికెట్ మైదానం మొదటిసారి చుసిన ఆ క్షణం, చుట్టూ విస్తారమైన పచ్చిక మైదానం, ప్రేక్షకులను చూసి వచ్చే ఆశ్చర్యం, ఏదైనా సాధ్యమే అన్న భావన. విశాఖలో ఒక పోలీసు అధికారి తన కుమార్తెకు ఆ అమూల్యమైన అనుభూతిని బహుమతిగా ఇచ్చారు. ఇది కేవలం ఒక మ్యాచ్ మాత్రమే కాదు, ఒక ప్రేరణకి వెలుగు. మహిళల ప్రతిభ, ఆశయాలకు వేదికగా ఈ మహోత్సవాన్ని ఆతిథ్యమిస్తున్నందుకు ఏపీ గర్విస్తోంది.’ అంటూ మంత్రి అనిత ‘X’లో పై ఫొటో షేర్ చేశారు.
News October 14, 2025
WCలో RO-KO ఆడతారా.. గంభీర్ ఆన్సర్ ఇదే!

దిగ్గజ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ 2027 వన్డే వరల్డ్ కప్‌లో ఆడే విషయమై తాను గ్యారంటీ ఇవ్వలేనని టీమ్ఇండియా హెడ్ కోచ్ గంభీర్ చెప్పారు. అది వారి ఫిట్‌నెస్‌తో పాటు స్థిరమైన ప్రదర్శనపై ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడ్డారు. రాబోయే ఆస్ట్రేలియా టూర్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. టెస్టులు, T20Iలకు వీడ్కోలు చెప్పిన రోహిత్, కోహ్లీ వన్డేల్లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
News October 14, 2025
ఇది భారత చరిత్రలో నిలిచిపోయే రోజు: అదానీ

గూగుల్‌తో కలిసి దేశంలోనే అతిపెద్ద AI డేటా సెంటర్‌ను విశాఖలో నిర్మిస్తున్నందుకు గర్వంగా ఉందని అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ అన్నారు. ‘ఇది భారత చరిత్రలో నిలిచిపోయే రోజు. దేశంలోని అత్యంత కీలకమైన విద్య, వ్యవసాయం, ఫైనాన్స్ తదితర రంగాలకు AI ద్వారా పరిష్కారాలు చూపే ఎకోసిస్టమ్‌ను ఈ హబ్ క్రియేట్ చేస్తుంది. AI రెవల్యూషన్‌కు తోడ్పడే ఇంజిన్‌ను నిర్మించడాన్ని గౌరవంగా భావిస్తున్నాం’ అని ట్వీట్ చేశారు.