News August 27, 2025

ఆ దేశాలతో చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందాలు: ట్రంప్

image

యూకే, చైనా, ఇండోనేషియా, వియత్నాం, ఫిలిప్పీన్స్, జపాన్, దక్షిణ కొరియా, EU దేశాలతో చారిత్రాత్మక ఒప్పందాలు చేసుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఆయా దేశాలు బిలియన్ల డాలర్లు US ట్రెజరీకి చెల్లిస్తున్నాయని పేర్కొన్నారు. అటు భారత్‌పై ఇప్పటికే 25% టారిఫ్స్ ఉండగా అదనంగా విధించిన టారిఫ్స్ IST ప్రకారం ఇవాళ ఉ.9.31 గంటల నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో భారత ఎగుమతులపై టారిఫ్స్ 50శాతానికి చేరుతాయి.

Similar News

News August 27, 2025

ఆ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం: ఆర్టీసీ ఎండీ

image

AP: ఆర్టీసీకి త్వరలోనే 1,500 ఎలక్ట్రికల్ ఏసీ బస్సులు రానున్నాయని ఎండీ ద్వారకా తిరుమలరావు చెప్పారు. స్త్రీ శక్తి పథకం ద్వారా వాటిలోనూ ఉచిత ప్రయాణం కల్పిస్తామని తెలిపారు. ఈ పథకం అమలు చేస్తున్న పక్క రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదన్నారు. స్త్రీ శక్తి కారణంగా పాత రూట్లు రద్దు చేసే ఆలోచన లేదని, అవసరమైతే డిమాండ్‌ను బట్టి మరిన్ని బస్సులు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

News August 27, 2025

ఎల్లో అలర్ట్.. భారీ వర్షాలు

image

AP: అల్పపీడన ప్రభావంతో అల్లూరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని IMD పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్లలో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నిన్న శ్రీకాకుళంలో 16cm, కళింగపట్నం13.3cm, వైజాగ్‌లో 11.8cmల వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

News August 27, 2025

టిష్యూ, యాపిల్స్‌తో వినాయకులు.. చూశారా?

image

వినాయక విగ్రహాల తయారీలో పలువురు తమలోని సృజనాత్మకతను చాటుకుంటున్నారు. ఒడిశాలోని సంబల్‌పుర్‌లో 1,500 కేజీల యాపిల్స్‌తో 28 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు పండ్లతో గణేషుడిని రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. గుజరాత్‌లోని సూరత్‌లో టిష్యూ పేపర్లతో పర్యావరణహిత విగ్రహాన్ని తయారు చేశారు. 350 కేజీల టిష్యూతో 16 అడుగుల ఎత్తులో రూపొందించిన ఈ విగ్రహం ఆకట్టుకుంటోంది.