News November 25, 2024

రోహిత్, అశ్విన్, షమీ లేకున్నా హిస్టారిక్ విన్

image

BGT తొలి టెస్టులో భారత్ చరిత్రాత్మక విజయం సొంతం చేసుకుంది. రోహిత్ శర్మ, గిల్, అశ్విన్, జడేజా, షమీ జట్టులో లేకపోయినా ప్రత్యర్థి భరతం పట్టింది. రన్స్‌ పరంగా (295) ఆసిస్‌పై టీమ్ ఇండియాకు ఇది రెండో అతిపెద్ద విజయం. 2003లో ఆడిలైడ్, 2008లో పెర్త్‌ విజయాలతో పోలిస్తే ఈ గెలుపు మరపురానిది. తొలి మ్యాచ్‌లోనే కంగారు జట్టును తీవ్ర ఒత్తిడిలోకి నెట్టిన టీమ్‌ఇండియా ఆసిస్ మాజీ క్రికెటర్ల కలలను కల్లలు చేసింది.

Similar News

News October 31, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* AP: తుఫానుతో రూ.5,265 కోట్ల నష్టం: చంద్రబాబు
* తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పవన్ పర్యటన
* 15లక్షల ఎకరాల్లో పంట నష్టం: జగన్
* TG: వరద ప్రాంతాల్లో రేపు సీఎం రేవంత్ పర్యటన
* దేశ ద్రోహానికి పాల్పడ్డ వ్యక్తి అజహరుద్దీన్: కిషన్ రెడ్డి
* ఎకరాకు రూ.10వేల చొప్పున సాయం: తుమ్మల
* సుప్రీంకోర్టు కొత్త సీజేఐగా జస్టిస్‌ సూర్యకాంత్
* WWC: ఫైనల్ చేరిన టీమ్ ఇండియా

News October 31, 2025

ఎవరు గెలిచినా చరిత్రే

image

WWC <<18154615>>సెమీఫైనల్లో<<>> ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించిన భారత జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. సౌతాఫ్రికాతో టైటిల్‌ పోరుకు సిద్ధమైంది. నవి ముంబై వేదికగా నవంబర్‌ 2న ఫైనల్ జరగనుంది. భారత్‌, సౌతాఫ్రికా జట్లు ఇప్పటివరకు ఒక్కసారి కూడా వరల్డ్ కప్‌ గెలవలేదు. ఈసారి ఎవరు విజేతగా నిలిచినా అది ఆ జట్టుకు తొలి వరల్డ్‌కప్‌గా చరిత్రలో నిలుస్తుంది.

News October 31, 2025

సర్దార్ పటేల్ ఫ్యామిలీతో మోదీ భేటీ

image

భారత తొలి ఉపప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ కుటుంబ సభ్యులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. వారితో సంభాషణ, దేశానికి సర్దార్ పటేల్ చేసిన సేవలను గుర్తు చేసుకోవడం గొప్పగా ఉందని Xలో పేర్కొన్నారు. గుజరాత్‌లోని కేవడియాలో సర్దార్ పటేల్‌ 150వ జయంతి వేడుకల్లో ఆయనకు నివాళిగా స్పెషల్ కాయిన్, స్టాంప్‌ను మోదీ రిలీజ్ చేశారు. ఈ ప్రాంతంలోనే ప్రపంచంలోనే ఎత్తైన సర్దార్ పటేల్ విగ్రహం(182 మీటర్లు) ఉంది.