News August 30, 2024
History Created: తొలిసారి నిఫ్టీ @ 25200

NSE నిఫ్టీ సరికొత్త రికార్డు సృష్టించింది. చరిత్రలో తొలిసారి 25200 స్థాయిని అధిగమించింది. ఉదయం 25,249 వద్ద మొదలైన సూచీ 77 పాయింట్ల లాభంతో 25,229 వద్ద కదలాడుతోంది. ఇక BSE సెన్సెక్స్ 215 పాయింట్లు పెరిగి 82,345 వద్ద చలిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందినా అన్ని రంగాల సూచీలు పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి. సూచీలు పెరుగుతున్నా BSE మార్కెట్ బ్రెడ్త్ మాత్రం బయ్యర్లకు అనుకూలంగా లేదు.
Similar News
News January 7, 2026
ADB: ఓటరు జాబితాలో లోపాలు ఉండొద్దు: ఎస్ఈసీ కమిషనర్

మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రూపొందించిన ఓటరు జాబితాలపై వచ్చిన అభ్యంతరాలు, ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై ఆమె సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఓటరు జాబితాలపై వచ్చిన అభ్యంతరాలు, ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరిస్తున్నట్లు ADB కలెక్టర్ రాజర్షిషా కమిషనర్‌కు వివరించారు.
News January 7, 2026
మీ పిల్లలు అబద్ధాలు చెబుతున్నారా?

తల్లిదండ్రులతో టీనేజర్స్ ఎక్కువగా అబద్ధాలు చెబుతుంటారు. అయితే ఇది కౌమారదశలో ఓ భాగమని నిపుణులు చెబుతున్నారు. పేరెంట్స్ ఏమంటారోనని భయంతో, ‘మేం మంచి పిల్లలం’ అనిపించుకోడానికి అబద్ధాలు చెబుతారని అంటున్నారు. తమ హద్దులు, అమ్మానాన్నల రియాక్షన్స్ తెలుసుకోవడానికి నిజాలు దాస్తారని పేర్కొంటున్నారు. వాళ్లు మరింత స్వేచ్ఛను కోరుకుంటున్నారని అర్థమని, అతిగా నిర్బంధించవద్దని సూచిస్తున్నారు.
News January 7, 2026
విజయ్ ‘జన నాయగన్’ విడుదల వాయిదా!

సెన్సార్ జాప్యంతో విజయ్ నటించిన ‘జన నాయగన్’ <<18789554>>వాయిదా<<>> పడినట్లు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ RFT Films ట్వీట్ చేసింది. ఇప్పటికే చెన్నైలో బుక్ మై షో నుంచి ఈ మూవీని తొలగించడంతో తమిళనాడులోనూ పోస్ట్‌పోన్ అయినట్లేనని సినీవర్గాలు చెబుతున్నాయి. అటు సినిమా వాయిదా పడిందని తమిళ మీడియా పేర్కొంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈ చిత్రం ఎల్లుండి రిలీజ్ కావాల్సి ఉండగా అదే రోజు తీర్పు చెప్తామని కోర్టు తెలిపింది.


