News July 14, 2024
చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ

టీమ్ ఇండియా యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించారు. ఓ T20 సిరీస్‌లో సెంచరీతోపాటు వికెట్ సాధించిన తొలి భారత ఆటగాడిగా అభిషేక్ రికార్డు నెలకొల్పారు. ఇప్పటివరకు భారత్ నుంచి మరే క్రికెటర్ కూడా ఈ ఫీట్ సాధించలేదు. కాగా జింబాబ్వేతో జరిగిన నాలుగో టీ20లో అభిషేక్‌కు బ్యాటింగ్ రాలేదు. బౌలింగ్‌లో మాత్రం 3 ఓవర్ వేసి 20 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టారు.
Similar News
News December 24, 2025
ముస్లింలపై దారుణాల గురించి రాయాలని ప్రశ్న.. ప్రొఫెసర్ సస్పెండ్

ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా వర్సిటీ ప్రొఫెసర్ అడిగిన ఓ ప్రశ్న వివాదానికి దారి తీసింది. ప్రొ.వీరేంద్ర బాలాజీ ‘INDలో ముస్లింలపై జరుగుతున్న దారుణాల గురించి రాయండి’ అని BA సెమిస్టర్ పరీక్షలో ప్రశ్న అడిగారు. ప్రశ్నాపత్రం SMలో వైరల్ కాగా ఇది రాజకీయ, మతపరమైన పక్షపాతంతో రూపొందించిన ప్రశ్న అని వర్సిటీకి ఫిర్యాదులందాయి. కమిటీని ఏర్పాటు చేసిన వర్సిటీ విచారణ పూర్తయ్యే వరకు ఆయన్ను సస్పెండ్ చేసింది.
News December 24, 2025
నేటి నుంచి VHT.. పంత్ మెరుస్తారా?

విజయ్ హజారే ట్రోఫీ నేటి నుంచి ప్రారంభం కానుంది. గ్రూపు-Dలో తొలి మ్యాచ్ ఆంధ్ర, ఢిల్లీ జట్ల మధ్య జరగనుంది. ఢిల్లీ సారథిగా పంత్ బరిలోకి దిగుతుండగా విరాట్ సైతం సందడి చేయనున్నారు. కొన్నాళ్లుగా టెస్టులకే పరిమితమైన పంత్ VHTని సద్వినియోగం చేసుకుంటే పరిమిత ఓవర్ల క్రికెట్‌లోకి వచ్చేందుకు మార్గం సుగమం అవుతుంది. మరోవైపు ముంబై జట్టులో రోహిత్, పంజాబ్ టీంలో గిల్, అభిషేక్ తదితర స్టార్ ప్లేయర్లు మెరవనున్నారు.
News December 24, 2025
95 లక్షల మంది ఓటర్లు తొలగింపు!

3 రాష్ట్రాలు, ఒక UTలో SIR తర్వాత 95 లక్షల మంది ఓటర్లను తొలగించారు. MPలో 42.74 లక్షల మంది, కేరళలో 24.08 లక్షల మంది పేర్లు ముసాయిదా ఓటర్ల జాబితాలో కనిపించలేదు. ఛత్తీస్‌గఢ్‌లో 27.34 లక్షల మంది, అండమాన్&నికోబార్‌లో 3.10 లక్షల మంది ఓటర్లలో 64,000 మందికి చోటు దక్కలేదు. తమ ఐడెంటిటీని వ్యక్తిగతంగా చూపించి FEB 21, 2026న ప్రచురించే తుది జాబితాలో పేర్లను చేర్చుకోవడానికి ఈ ఓటర్లకు వారం రోజుల టైం ఇచ్చారు.


