News December 7, 2024

చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ

image

టీమ్ ఇండియా క్రికెటర్ అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించారు. SMAT (సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ) చరిత్రలో అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాడిగా అభిషేక్ నిలిచారు. ఇప్పటివరకు ఆయన 4 శతకాలు బాదారు. ఆయన తర్వాత ఉన్ముక్త్ చంద్ (3), రుతురాజ్ గైక్వాడ్ (3), ఇషాన్ కిషన్ (3), శ్రేయస్ అయ్యర్ (3) ఉన్నారు. కాగా మేఘాలయతో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన సంగతి తెలిసిందే.

Similar News

News November 20, 2025

HYD: మెట్రోలో వారి కోసం ప్రత్యేక స్కానింగ్

image

మెట్రోలో భద్రత మా ప్రాధాన్యం అని HYD మెట్రో తెలిపింది. ప్రతి స్టేషన్‌లో ఆధునిక సీసీటీవీ నిఘా, కఠిన భద్రతా తనిఖీలు అమలు చేస్తూ ప్రయాణికుల రక్షణను మరింత బలపరుస్తున్నట్లు తెలిపింది. ఫేస్‌మేకర్లు, గుండె రోగులు, గర్భిణీలకు పూర్తిగా సురక్షితమైన స్కానర్లు ఏర్పాటు చేయడం మెట్రో భద్రతా ప్రమాణాలకు నిదర్శనంగా పేర్కొంది.

News November 20, 2025

దేవ్‌జీ, రాజిరెడ్డి మా వద్ద లేరు.. HCకి తెలిపిన పోలీసులు

image

AP: టాప్ మావోలు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌‌జీ, మల్లా రాజిరెడ్డిని కోర్టులో హాజరుపర్చేలా ఆదేశించాలన్న పిటిషన్లపై పోలీసులు HCలో వివరణ ఇచ్చారు. వారిద్దరూ తమ వద్ద లేరన్నారు. దీంతో వారు పోలీసుల వద్ద ఉన్నారనేందుకు ఆధారాలు చూపాలని పిటిషనర్లను HC ఆదేశించింది. మావో కీలక నేతలు తమ అధీనంలో ఉన్నారన్న పోలీసుల ప్రెస్ స్టేట్‌‌మెంట్‌‌ను సమర్పిస్తామని పిటిషనర్లు చెప్పడంతో విచారణను HC రేపటికి వాయిదా వేసింది.

News November 20, 2025

చాపింగ్ బోర్డును ఇలా క్లీన్ చేయండి

image

కూరగాయలు కట్ చేయడం కోసం చాపింగ్‌ బోర్డు ఎక్కువగా వాడతారు. కానీ దాని క్లీనింగ్‌పై అంత దృష్టి పెట్టరు. దీనికోసం కొన్ని టిప్స్..* చాపింగ్​బోర్డుపై కొద్దిగా నీళ్లు, బేకింగ్ సోడా వేసి 5 నిమిషాలు నిమ్మ చెక్కతో రుద్ది వదిలేయాలి. 15 నిమిషాల తర్వాత క్లీన్ చేయాలి. * ఉప్పు, నిమ్మచెక్కతో చాపింగ్ బోర్డును రుద్ది, 10 నిమిషాల తర్వాత నీటితో కడిగెయ్యాలి. * దీన్ని క్లీన్ చేయడానికి మెటల్ స్క్రబ్బర్లను వాడకూడదు.