News June 24, 2024

చరిత్ర పునరావృతమవుతుంది: కేటీఆర్

image

TG: అధికారంలో ఉన్న వ్యక్తుల కంటే ప్రజల శక్తి ఎప్పుడూ బలంగానే ఉంటుందని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ <<13498328>>ఎమ్మెల్యేలు<<>> కాంగ్రెస్‌లో చేరడంపై X వేదికగా స్పందించారు. ‘2004-06లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేకసార్లు ఎమ్మెల్యేల ఫిరాయింపులను ఎదుర్కొన్నాం. ఆ తర్వాత తెలంగాణ ప్రజలు దీటుగా స్పందించారు. చివరికి కాంగ్రెస్ తల వంచాల్సి వచ్చింది. మరోసారి చరిత్ర పునరావృతమవుతుంది’ అని పేర్కొన్నారు.

Similar News

News January 10, 2025

నేడు TTD ధర్మకర్తల మండలి అత్యవసర భేటీ

image

AP: తిరుమలలో ఇవాళ సా.4 గంటలకు TTD ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం కానుంది. తిరుపతి తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారంపై ఇందులో తీర్మానించనున్నట్లు సమాచారం. సాయంత్రానికి చెక్కులు తయారు చేసి, రేపు ఉదయానికల్లా ముగ్గురు టీటీడీ బోర్డు సభ్యుల బృందం మృతుల గ్రామాలకే వెళ్లి వాటిని అందజేసే అంశంపైనా చర్చించనున్నారు. తొక్కిసలాటలో ఆరుగురు చనిపోగా రూ.25లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే.

News January 10, 2025

OTTలోకి వచ్చేసిన కొత్త సినిమా

image

అల్లరి నరేశ్ నటించిన ‘బచ్చలమల్లి’ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. ఇవాళ్టి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. సుబ్బు మంగదేవి డైరెక్ట్ చేసిన ఈ మూవీ గత నెల 20న థియేటర్లలో విడుదలై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. నరేశ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇందులో అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటించగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.

News January 10, 2025

బీజేపీ నేత ఇంట్లో మొస‌ళ్లు.. ఐటీ అధికారులకు మైండ్ బ్లాంక్‌

image

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు చెందిన BJP Ex MLA హ‌ర్వంశ్ సింగ్ ఇంట్లో రైడ్ చేయ‌గా ₹3 కోట్ల డ‌బ్బు, బంగారం-వెండి, బినామీ కార్లతోపాటు 3 మొస‌ళ్లు దొర‌క‌డంతో IT అధికారులు అవాక్క‌య్యారు. సాగ‌ర్ న‌గ‌రంలో హ‌ర్వంశ్ సింగ్‌తోపాటు బీడీ వ్యాపార భాగ‌స్వామి రాజేశ్ కేశ‌ర్వాని ఇళ్ల‌లోనూ సోదాలు నిర్వ‌హించారు. వీరు ₹155 కోట్ల పన్ను ఎగ్గొట్టిన‌ట్టు అధికారులు వెల్ల‌డించారు. రాజేశ్ ఒక్క‌డే ₹140 కోట్లు ఎగ్గొట్టిన‌ట్టు తెలిపారు.