News April 9, 2025

ఈరోజు సాయంత్రం ‘HIT-3’ సెకండ్ సింగిల్

image

నేచురల్ స్టార్ నాని హీరోగా శైలేష్ కొలను తెరకెక్కిస్తోన్న ‘హిట్ 3’ సినిమా నుంచి ఇవాళ సెకండ్ సింగిల్ విడుదల కానుంది. ‘అబ్కీ బార్ అర్జున్ సర్కార్’ అంటూ సాగే ఈ సాంగ్‌ను ఇవాళ సాయంత్రం 6.03 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ సింగిల్ ‘ప్రేమ వెల్లువ’ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రం మే 1న థియేటర్లలో విడుదల కానుంది.

Similar News

News April 18, 2025

అరుదైన ఘనత సాధించిన హెడ్

image

IPL: వాంఖడేలో MIతో జరుగుతున్న మ్యాచ్‌లో SRH ఓపెనర్ ట్రావిస్ హెడ్ అరుదైన ఘనత సాధించారు. ఐపీఎల్ చరిత్రలో వేగంగా 1000 రన్స్ పూర్తి చేసిన రెండో ఆటగాడిగా నిలిచారు. మొత్తంగా 575 బంతుల్లో ఈ మైలురాయిని చేరుకున్నారు. ఈ జాబితాలో తొలి స్థానంలో రస్సెల్(545), హెడ్ తర్వాత క్లాసెన్(594), సెహ్వాగ్(604), మ్యాక్స్‌వెల్(610), యూసుఫ్ పఠాన్(617), నరైన్(617) ఉన్నారు.

News April 18, 2025

ఏప్రిల్ 18: చరిత్రలో ఈరోజు

image

1809: కవి, పండితుడు హెన్రీ డెరోజియా జననం
1880: రచయిత టేకుమళ్ల అచ్యుతరావు జననం
1958: విండీస్ మాజీ క్రికెటర్ మాల్కం మార్షల్ జననం
1859: స్వాతంత్ర్యసమరయోధుడు తాంతియా తోపే మరణం
1955: శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్(ఫొటోలో) మరణం
* ప్రపంచ వారసత్వ దినోత్సవం (అంతర్జాతీయ చారిత్రక కట్టడాల దినోత్సవం)

News April 18, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

error: Content is protected !!