News July 17, 2024

వచ్చే నెలలో ‘హిట్-3’ షూటింగ్ ప్రారంభం?

image

నాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శైలేశ్ కొలను కాంబోలో రానున్న ‘హిట్-3’ సినిమా షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై మూవీ టీమ్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. నాని నటించిన ‘సరిపోదా శనివారం’ ఆగస్టు 29న రిలీజ్ కానుంది. ‘దసరా’ డైరెక్టర్ శ్రీకాంత్‌తోనూ ఆయన ఓ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే.

Similar News

News November 3, 2025

నిద్రపోయే ముందు రీల్స్ చూస్తున్నారా?

image

చాలామంది రీల్స్ చూస్తూ నిద్రను పాడు చేసుకుంటున్నారని వైద్యులు గుర్తించారు. స్క్రీన్ల నుంచి వచ్చే బ్లూ లైట్ నిద్రకు సహాయపడే మెలటోనిన్ హార్మోన్‌ను అణచివేస్తుందని తెలిపారు. ‘నిరంతర ఉద్దీపన వల్ల మెదడు విశ్రాంతి తీసుకోకుండా చురుకుగా ఉంటుంది. దీని ఫలితంగా నిద్ర నాణ్యత తగ్గి, మరుసటి రోజు బ్రెయిన్ ఫాగ్, చిరాకు పెరుగుతాయి. అందుకే నిద్రకు 30-60 నిమిషాల ముందు రీల్స్, టీవీ చూడకండి’ అని సూచించారు.

News November 3, 2025

కంకర ఓవర్ లోడ్ కారణంగానే ప్రమాదం!

image

TG: చేవెళ్ల బస్సు ప్రమాదానికి సంబంధించి కీలకాంశాలు వెలుగులోకి వచ్చాయి. కంకర ఓవర్‌లోడ్‌ కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ‎‎ఘటనా సమయంలో టిప్పర్‌లోనే యజమాని లక్ష్మణ్‌ ఉన్నారు. లడారం-శంకర్‌పల్లి వరకు టిప్పర్‌ను ఆయనే నడిపారు. ‎ఆ తర్వాత డ్రైవర్‌ ఆకాశ్‌కు ఇచ్చారు. గాయపడిన లక్ష్మణ్‌ నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. కండక్టర్ రాధ ఫిర్యాదుతో చేవెళ్ల పోలీసులు కేసు నమోదు చేశారు.

News November 3, 2025

ఢిల్లీలో కాలుష్య నివారణ చర్యలపై అఫిడవిట్ ఇవ్వండి: సుప్రీం

image

ఢిల్లీలో వాయుకాలుష్య నివారణకు తీసుకుంటున్న చర్యలపై అఫిడవిట్ సమర్పించాలని సుప్రీంకోర్టు కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంటును ఆదేశించింది. వాయు పర్యవేక్షణ కేంద్రాలు పనిచేయడం లేదన్న మీడియా వార్తలపై ప్రశ్నించింది. CPCB, DPCC, NCR పరిధిలోకి వచ్చే జిల్లాల్లో OCT 14-25 మధ్య పరీక్షించిన గాలి నాణ్యత నివేదికల్ని సమర్పించాలని చెప్పింది. CJI గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ ఈ కేసును విచారించి ఆదేశాలిచ్చారు.