News July 10, 2024
హిట్ అండ్ రన్ కేసు.. నిందితుడికి 7రోజుల కస్టడీ

ముంబై హిట్ అండ్ రన్ కేసు నిందితుడు, శివసేన(శిండే) నేత రాజేశ్ షా కుమారుడు మిహిర్ షాకు కోర్టు 7 రోజుల పోలీస్ కస్టడీ విధించింది. దీంతో ఈనెల 16 వరకు పోలీసులు అతడిని విచారించనున్నారు. ఘటన తర్వాత మిహిర్ కారు నంబర్ ప్లేట్‌ను తొలగించాడని గుర్తించారు. అతడికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదని భావిస్తున్నారు. ఆయా విషయాలపై మిహిర్‌ను ప్రశ్నించనున్నారు. ఆదివారం మిహిర్ తన కారుతో ఢీకొట్టిన ఘటనలో ఓ మహిళ మరణించింది.
Similar News
News November 7, 2025
అజిత్ సినిమాలో విజయ్ సేతుపతి, లారెన్స్!

హీరో అజిత్ కుమార్ ప్రస్తుతం అదిక్ రవిచంద్రన్ డైరెక్షన్లో AK 64 మూవీతో బిజీగా ఉన్నారు. సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు జనవరిలో ప్రకటిస్తామన్నారు. దీనిని పాన్ ఇండియా లెవల్లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. అయితే కోలీవుడ్ వర్గాల ప్రకారం ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, లారెన్స్ కీలక పాత్రల్లో కనిపిస్తారని చెబుతున్నారు. త్వరలోనే చిత్ర బృందం అధికారిక ప్రకటన విడుదల చేస్తుందని సమాచారం.
News November 7, 2025
Paytm నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్

పేటీఎం సంస్థ ‘చెక్-ఇన్’ పేరిట కొత్త AI ట్రావెల్ బుకింగ్ యాప్‌ను ప్రారంభించింది. బస్, మెట్రో, ట్రైన్స్, ఫ్లైట్స్‌కు సంబంధించిన వంటి టికెట్స్‌ను ఈ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ మేనేజ్మెంట్, పర్సనల్ ట్రావెల్ ప్లాన్స్, డెస్టినేషన్ రికమెండేషన్స్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. దీంతో ప్రజలు మరింత స్మార్ట్‌గా, సులభంగా ట్రావెలింగ్ ప్లాన్ చేసుకోవచ్చని పేటీఎం ట్రావెల్ సీఈవో వికాస్ జలాన్ తెలిపారు.
News November 7, 2025
డికాక్ సూపర్ సెంచరీ.. ఒంటి చేత్తో గెలిపించాడు

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా పాక్‌తో జరిగిన రెండో వన్డేలో SA బ్యాటర్ క్వింటన్ డికాక్ శతకంతో చెలరేగారు. 270 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రొటీస్ ప్లేయర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. డికాక్ 119 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సుల సాయంతో 123* పరుగులు చేశారు. టోనీ(76), ప్రిటోరియస్(46) రాణించారు. కేవలం 40.1 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి టార్గెట్ రీచ్ అయ్యారు. దీంతో 1-1తో సిరీస్‌ను సమం చేశారు.


