News May 1, 2024
OTTలోకి హిట్ చిత్రం ‘క్రూ’

బాలీవుడ్ బ్యూటీలు కరీనా కపూర్, కృతి సనన్, టబు నటించిన కామెడీ చిత్రం ‘క్రూ’ డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. వచ్చే నెల 24 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. విజయ్ మాల్యా, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఆధారంగా ₹70 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ ₹150 కోట్ల కలెక్షన్లు సాధించింది. ఉద్యోగులకు సంస్థ జీతాలు ఎగ్గొట్టడంతో ఆ ముగ్గురూ యజమానినే దోచేయాలనుకోవడం, ఆ తర్వాత ఏం జరిగిందనే కథాంశంతో చిత్రం రూపొందింది.
Similar News
News March 5, 2026
బిహార్‌లో తొలి బీజేపీ సీఎం.. రంగం సిద్ధం!

మోదీ నేతృత్వంలో 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన BJP అనేక రాష్ట్రాలపై పట్టు సాధిస్తూ వస్తోంది. ఈ జాబితాలో బిహార్ కూడా చేరనుంది. సీఎం నితీశ్ RSకు వెళ్లనుండటంతో ఆయన స్థానంలో తొలిసారి <<19302367>>BJP నేత<<>> CM పీఠం ఎక్కే అవకాశం ఉంది. 2014 తర్వాత అస్సాంలో శర్బానంద, మణిపుర్‌లో బీరేన్‌సింగ్, త్రిపురలో బిప్‌లాబ్, హరియాణాలో మనోహర్, అరుణాచల్‌లో పెమా ఖండు, ఒడిశాలో మోహన్ BJP నుంచి తొలిసారి CMలు అయ్యారు.
News March 5, 2026
సరైన సమయంలో పెళ్లిళ్లు జరగాలి: సీఎం

AP: డబ్బులు ఉన్న వారు ఎందుకు తక్కువ మంది పిల్లలను కంటున్నారని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రశ్నించారు. ‘ఇప్పటికీ పేదవారే ఎక్కువ మంది పిల్లలను కంటున్నారు. అందుకే తల్లికి వందనం పథకం అందరికీ ఇచ్చాం. సరైన సమయంలో పెళ్లిళ్లు జరగాలి. ఈ రోజుల్లో విడాకులు కూడా ఎక్కువ అయిపోయాయి. భార్యాభర్తలకు సహనం లేకుండా పోయింది. సామాజిక సమస్యలపై మనం మాట్లాడితేనే ప్రజల్లో అవగాహన పెరుగుతుంది’ అని తెలిపారు.
News March 5, 2026
లోన్‌పై బండి కొన్నారా? ఆ ఇబ్బంది ఉండదిక!

లోన్‌పై వెహికల్ తీసుకుంటే ఉండే హైపోథికేషన్ మార్క్ తొలగింపు ఇక ఈజీ కానుంది. రుణ చెల్లింపు పూర్తయితే RTOకు ఆన్‌లైన్లో బ్యాంకులు సమాచారం అందిస్తే ఆటోమేటిక్‌గా అప్డేట్ అయ్యే ఫీచర్‌ను కేంద్ర రవాణా శాఖ ప్రారంభించింది. SBI, 5 NBFCలతో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఈ సౌకర్యాన్ని త్వరలో అన్ని బ్యాంకులకూ విస్తరించనుంది. ప్రస్తుతం బ్యాంకులు ఇచ్చే నో డ్యూ కాపీలు RTO ఆఫీసులకు వెళ్లి ఇస్తే ఇది పోతుంది.


