News June 22, 2024
18 ఏళ్ల వయసులోనే క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డా: నటి

అప్పట్లో ఓ స్టార్ హీరో తనను డ్రైవర్ లేకుండా ఒంటరిగా కలవమని చెప్పినట్లు హీరోయిన్ ఇషా కొప్పికర్ తెలిపారు. కానీ తాను ఆయన విజ్ఞప్తిని తిరస్కరించానని చెప్పారు. ‘18 ఏళ్ల వయసులోనే క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డా. నన్ను చాలా మంది అసభ్యంగా తాకేవారు. పని కావాలంటే హీరోలతో సన్నిహితంగా ఉండాలని కొందరు సలహాలిచ్చేవారు’ అంటూ ఆమె వాపోయారు. కాగా చంద్రలేఖ, ప్రేమతో రా, కేశవ సినిమాల్లో ఇషా నటించారు.
Similar News
News December 4, 2025
అమరావతిలో ‘అంతిమ యాత్ర’ చిక్కులు

అమరావతి నిర్మాణంలో ‘శ్మశాన వాటికల’ ఏర్పాటు కొత్త సవాలుగా మారింది. ‘మన గ్రామం-మన శ్మశానం’ అనే సెంటిమెంట్ బలంగా ఉండటంతో, రైతులు గ్రామాల వారీగా శ్మశానాలు కోరుతున్నారు. రాజధాని అభివృద్ధిలో పాత దారులు మూసుకుపోవడంతో సమస్య జఠిలమైంది. హిందూ, ముస్లిం, దళితుల సంప్రదాయాలను గౌరవిస్తూ, హైబ్రిడ్ మోడల్లో 3-4గ్రామాలకు ఒక క్లస్టర్, లేదా కృష్ణా నది ఒడ్డున ఉమ్మడి శ్మశానాల ఏర్పాటుపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది.
News December 4, 2025
నేవీలో తొలి మహిళా ఫైటర్ పైలట్ ఆస్తా పూనియా

భారత నౌకాదళంలో మొట్ట మొదటి మహిళా ఫైటర్ పైలట్‌గా చరిత్ర సృష్టించారు ఆస్తా పూనియా. ప్రతిష్ఠాత్మకమైన ‘వింగ్స్ ఆఫ్ గోల్డ్’ పురస్కారాన్ని అందుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరర్‌కు చెందిన ఆస్తా ఇంజినీరింగ్ చేశారు. నేవీ యుద్ధవిమానాన్ని నడపడం ఆషామాషీ విషయం కాదు. ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ ఫైటర్ స్ట్రీమ్‌లో అడుగుపెట్టిన తొలి మహిళగా ప్రత్యేకత చాటుకున్నారామె. ఎంతోమంది యువతులకు రోల్‌మోడల్‌గా నిలిచింది.
News December 4, 2025
డిగ్రీ లేకపోయినా ఉద్యోగమిస్తా: జోహో CEO

జోహో సీఈవో శ్రీధర్ వెంబు సూపర్ ఆఫర్ ఇచ్చారు. నైపుణ్యం ఉంటే చాలని.. డిగ్రీ లేకుండానే ఉద్యోగం ఇస్తానని ప్రకటించారు. పిల్లలపై ఒత్తిడి పెట్టడం మానాలని భారతీయ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. అమెరికాలో యువత డిగ్రీ వదిలి నేరుగా ఉద్యోగాలను ఎంచుకుంటున్న ధోరణిని ఉదాహరణగా చూపించారు. Zohoలో ఏ ఉద్యోగానికీ డిగ్రీ క్రైటీరియా లేదని తెలిపారు. తనతో పనిచేస్తున్న టీమ్‌లో సగటు వయస్సు 19 ఏళ్లు మాత్రమేనని అన్నారు.


