News July 12, 2024
వింబుల్డన్‌లో హిట్‌మ్యాన్ సందడి

ప్రతిష్ఠాత్మక గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ వింబుల్డన్‌లో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ సందడి చేశారు. స్టైలిష్ లుక్‌లో హిట్‌మ్యాన్ అదిరిపోయారు. రోహిత్ రాకతో వింబుల్డన్ సెంటర్ కోర్టు కోలాహలంగా మారింది. మ్యాచ్‌ను వీక్షిస్తున్న ఫొటోలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారాయి. ఈ పిక్స్ చూసిన అభిమానులు తెగ సంతోషపడుతున్నారు.
Similar News
News December 27, 2025
గుడికి వెళ్లొచ్చిన తర్వాత కాళ్లుచేతులు కడగకూడదా?

గుడికి వెళ్లొచ్చిన వెంటనే కాళ్లు, చేతులు కడగకూడదని పండితులు సూచిస్తున్నారు. అలా కడిగితే గుడిలో లభించిన దైవిక శక్తి, పాజిటివ్ వైబ్రేషన్స్ తొలగిపోతాయంటున్నారు. ‘ప్రదక్షిణల ద్వారా పాదాలు, పూజ ద్వారా శరీరం గ్రహించిన శక్తిని వెంటనే నీటితో కడిగేయకూడదు. కనీసం 15-20 నిమిషాల వరకు వేచి ఉండటం మంచిది. అయితే ఏదైనా తినే ముందు లేదా అపరిశుభ్రంగా అనిపిస్తే చేతులు కడుక్కోవడంలో తప్పు లేదు.
News December 27, 2025
స్వయంకృషి: మెటల్ ఇన్వెస్ట్మెంట్

సింపుల్‌గా చెప్పాలంటే బంగారం, వెండి వంటి లోహాలపై పెట్టుబడి. ఇవేకాక కాపర్, అల్యూమినియం, ఐరన్ ఇలా చాలా మెటల్స్ ఉన్నాయి. ఇవి అంతర్జాతీయంగా నిరంతరం వినియోగంలో ఉంటాయి. ధరలు పెరుగుతాయి, లేదా కొంత కరెక్షన్ ఉంటుంది తప్ప పడిపోవు. కొంతకాలం మెటల్ మార్కెట్‌ను పరిశీలిస్తే మీకు అవగాహన వస్తుంది. నెల క్రితం కేజీ వెండి ఇవాళ్టి కంటే రూ.1లక్ష తక్కువ. నెలలో ఎంత లాభమో చూశారుగా.
రోజూ ఒంటిగంటకి ఓ బిజినెస్ ఐడియా
News December 27, 2025
IOCLలో 501 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) నార్తర్న్ రీజియన్‌లో 501 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు నేటి నుంచి జనవరి 9 వరకు NATS/NAPS పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. వయసు 18 నుంచి 24ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://iocl.com


