News July 21, 2024
యూఎస్ వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న హిట్మ్యాన్

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ యూఎస్ వెకేషన్లో ఎంజాయ్ చేస్తున్నారు. తన భార్య రితికా సజ్దే, కూతురు సమైరాతో కలిసి ఆయన అక్కడ పర్యటిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను హిట్మ్యాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్గా మారాయి. కాగా వచ్చే నెల 2 నుంచి శ్రీలంకతో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఆ సిరీస్లో ఆడేందుకు రోహిత్ త్వరలోనే లంకకు వెళ్లనున్నారు.
Similar News
News October 26, 2025
వైద్య సిబ్బంది 24hrs అందుబాటులో ఉండాలి: మంత్రి సత్యకుమార్

AP: మొంథా తుఫాన్ ప్రభావం తగ్గుముఖం పట్టే వరకు డాక్టర్లు, సిబ్బంది 24 గంటలు ఆరోగ్య కేంద్రాల్లో ఉండాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. వాతావరణ సూచనలతో అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. అంబులెన్సులు, ఫీడర్ వెహికల్స్ మ్యాపింగ్ చేశామని వైద్యారోగ్య శాఖ CS సౌరభ్ గౌర్ తెలిపారు. ఎపిడమిక్ సెల్, ఎమర్జెన్సీ టీమ్లు సిద్ధం చేశామన్నారు.
News October 26, 2025
కరూర్ బాధితులను కలవనున్న విజయ్

TVK చీఫ్ విజయ్ కరూర్ ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41మంది మరణించిన విషయం తెలిసిందే. ఆ బాధిత కుటుంబాలను విజయ్ అక్టోబర్ 27న చెన్నై దగ్గర్లోని ఓ రిసార్ట్లో కలవనున్నారు. ఇప్పటికే రిసార్ట్లో 50 గదులు బుక్ చేసినట్లు తెలుస్తోంది. ప్రతి కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలిసి విజయ్ పరామర్శిస్తారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. బాధిత కుటుంబాలను కలిసేందుకు ప్రభుత్వం అనుమతించకపోవడంతో ఈ ఏర్పాటు చేసినట్లు తెలిపాయి.
News October 25, 2025
స్లీప్ బ్యాంకింగ్.. నిద్రను దాచుకోండి!

పని లేనప్పుడు ఎక్కువ గంటలు నిద్రపోవడం, పని ఉన్నప్పుడు తక్కువ గంటలు నిద్రపోవడాన్నే ‘స్లీప్ బ్యాంకింగ్’ అంటారు. ఉదాహరణకు ఫలానా రోజు మీకు ఆఫీస్ అవర్స్ ఎక్కువ ఉన్నట్లు తెలిస్తే 3-7 రోజుల ముందే నిత్యం 2-3 గంటలు అధికంగా నిద్రపోవాలి. దీంతో వర్క్ అధికంగా ఉన్నా నిద్రకు ఎలాంటి ఇబ్బంది కలగదని అధ్యయనంలో తేలింది. అలాగే పసిపిల్లల తల్లులు కూడా సమయం దొరికినప్పుడు ఒక న్యాప్ వేస్తేనే అలసట దరిచేరదట.


