News September 30, 2024

హిట్‌మ్యాన్ అరుదైన ఘనత

image

కాన్పూర్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ సిక్సుతో తన ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. దీంతో తొలి బంతికే సిక్స్ కొట్టిన నాలుగో భారత ప్లేయర్‌గా నిలిచారు. 2006లో WIపై ధోనీ, 2012లో NZపై జహీర్ ఖాన్, 2013లో AUSపై సచిన్ ఫస్ట్ బాల్‌కే సిక్స్ కొట్టారు. కాగా, హసన్ మిరాజ్ బౌలింగ్‌లో 23 పరుగుల వద్ద రోహిత్ బౌల్డ్ అయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 285 పరుగులకు డిక్లేర్ చేసింది.

Similar News

News December 31, 2025

సూర్య, నేను మంచి స్నేహితులమే: ఖుషీ

image

టీమ్ ఇండియా T20 కెప్టెన్ సూర్య కుమార్ తనకు తరచూ <<18713013>>మెసేజ్<<>> చేసేవాడన్న వ్యాఖ్యలపై నటి ఖుషీ ముఖర్జీ క్లారిటీ ఇచ్చారు. తాము మంచి స్నేహితులమని తెలిపారు. అంతకుమించి చెప్పడానికీ తమ మధ్య ఏమీ లేదన్నారు. కాగా ఆ సమయంలో సూర్య మ్యాచ్ ఓడిపోవడంతో తాను బాధపడినట్లు పేర్కొన్నారు. దీంతో అప్పుడే క్లారిటీగా చెప్పాల్సిందని ఖుషీపై సూర్య ఫ్యాన్స్ ఫైరవుతున్నారు.

News December 31, 2025

2025: రెండు రోజులకో అవినీతి కేసు

image

TG: ఈ ఏడాది సగటున రెండు రోజులకు ఒక అవినీతి కేసు నమోదైనట్లు ACB తెలిపింది. మొత్తంగా 199 కేసులు రిజిస్టర్ అయ్యాయని వెల్లడించింది. ట్రాప్ కేసుల్లో 176 ప్రభుత్వ ఉద్యోగులు అరెస్టయ్యారని, మొత్తంగా 273 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొంది. సోదాల్లో రూ.96.13 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను, రూ.57.17 లక్షల నగదును గుర్తించామంది.
* అవినీతిపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ నంబర్ 1064, వాట్సాప్ 9440446106

News December 31, 2025

ఈ ఏడాది క్రీడల్లో రాణించిన అమ్మాయిలు

image

ఈ ఏడాది అన్ని రంగాల్లో అతివలు రాణించారు. ముఖ్యంగా క్రీడల్లో భారత మహిళా క్రికెట్ జట్టు వన్డే వరల్డ్ కప్, అంధుల మహిళల టీమ్ టీ20 వరల్డ్ కప్, కబడ్డీ వరల్డ్ కప్, రోల్ బాల్ WC గెలిచారు. హాకీ ఆసియా కప్‌, అథ్లెటిక్స్, వరల్డ్ బాక్సింగ్ కప్‌లోనూ భారత నారీమణులు ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. వీటితో పాటు షూటింగ్ నుంచి చెస్ వరకు, గోల్ఫ్ నుంచి బాక్సింగ్ వరకు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు గెలిచి స్ఫూర్తిని నింపారు.