News June 6, 2024
T20ల్లో హిట్‌మ్యాన్ అరుదైన ఘనత

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20ల్లో 4000 పరుగులు పూర్తి చేసుకున్న మూడో బ్యాటర్‌గా చరిత్ర సృష్టించారు. ఐర్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆయన ఈ ఘనత సాధించారు. రోహిత్ కంటే ముందు విరాట్ కోహ్లీ, బాబర్ ఆజామ్ ఈ మార్క్ దాటారు. అలాగే తక్కువ బంతుల్లో 4వేల రన్స్ పూర్తి చేసుకున్న తొలి ప్లేయర్‌గానూ హిట్‌మ్యాన్ రికార్డులకెక్కారు.
Similar News
News November 19, 2025
రైతు అభివృద్ధే లక్ష్యం: మార్నేని రవీందర్

హనుమకొండ డీసీసీబీ బ్యాంకులో 72వ అఖిల భారత సహకార వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ స్నేహ శబరీష్, అపెక్స్ బ్యాంక్ ఛైర్మన్ మార్నేని రవీందర్ రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్యాక్స్(PACS) లను సాధారణ సేవా కేంద్రాలుగా అభివృద్ధి చేసి, గ్రామీణ ప్రజలకు స్థిర జీవనోపాధి కల్పించడమే సహకార రంగం లక్ష్యమని వారు పేర్కొన్నారు.
News November 19, 2025
ఖైదీని మార్చిన పుస్తకం!

మనిషి జీవితంపై పుస్తకాలు ఎంత ప్రభావం చూపుతాయో తెలిపే ఘటనే ఇది. అమెరికాకు చెందిన రెజినాల్డ్ డ్వైన్ బెట్స్ 17 ఏళ్ల వయసులో కార్ జాకింగ్ కేసులో జైలుపాలయ్యారు. ఏకాంత కారాగారంలో ఆయన ‘ది బ్లాక్ పోయెట్స్’ పుస్తకం చదివి స్ఫూర్తిపొందారు. 2020లో ఆయన ‘ఫ్రీడమ్ రీడ్స్’ అనే సంస్థను స్థాపించి అమెరికాలోని జైళ్లలో లైబ్రరీలను ఏర్పాటు చేస్తున్నారు. అలా 500 పుస్తకాలతో కూడిన 35 కొత్త లైబ్రరీలను ప్రారంభించారు.
News November 19, 2025
మంగళగిరి: భార్యని హత్య చేసిన భర్త

గుంటూరు(D) మంగళగిరి పరిధి యర్రబాలెంలో వివాహిత హత్యకు గురైంది. CI బ్రహ్మం, SI వెంకట్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. వారి వివరాల మేరకు.. మచిలీపట్నంకు చెందిన కిలిమి లక్ష్మీ(29) ఐదేళ్ల క్రితం శంకర్ రెడ్డిని పెళ్ళి చేసుకుంది. కలహాలతో విడిపోయి, చినకాకానికి చెందిన వ్యక్తితో సహజీవనం చేస్తూ యర్రబాలెంలో ఉంటుంది. ఈ నేపథ్యంలో భర్త శంకరరెడ్డి గొంతునులిమి హత్యచేశాడు. నిందితుడు పరారీలో ఉన్నాడు.


