News September 10, 2025
ప్రాక్టీస్ షురూ చేసిన హిట్‌మ్యాన్

టీమ్ ఇండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్ కోసం రెడీ అవుతున్నారు. తాజాగా ముంబైలో ప్రాక్టీస్ ప్రారంభించారు. అభిషేక్ నాయర్ ట్రైనింగ్‌లో బరువు తగ్గిన రోహిత్.. రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాలో మూడు వన్డేలు జరగనున్నాయి. అటు 2027 వన్డే ప్రపంచకప్ వరకు హిట్‌మ్యాన్ ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Similar News
News March 14, 2026
రెండేళ్లు మీ ఆస్తులు కాపాడుకోండి: KTR

TG: మూసీ పరీవాహక ప్రాంత ప్రజలు రెండేళ్లు తమ ఆస్తులు కాపాడుకోవాలని, తర్వాత తమ ప్రభుత్వమే వస్తుందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. BRS హయాంలో చేపట్టిన మూసీ అభివృద్ధిపై HYD హిమాయత్ సాగర్ వద్ద ఆయన PPT ఇచ్చారు. రానున్న రెండేళ్లు కాంగ్రెస్ బుల్డోజర్ ప్రభుత్వంపై పోరాటానికి మూసీ బాధితులంతా తమకు అండగా ఉండాలని కోరారు. HYDలో మూసీని మురికికూపంగా మార్చిందే కాంగ్రెస్ అని దుయ్యబట్టారు.
News March 14, 2026
భట్టి ఇంటికి సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంటికి వెళ్లారు. ఇటీవల భట్టి కుమారుడి వివాహం జరగగా బిజీ షెడ్యూల్ వల్ల చంద్రబాబు హాజరు కాలేకపోయారు. దీంతో ఇవాళ హైదరాబాద్‌లోని ఆయన నివాసం ప్రజాభవన్‌కు వెళ్లి నూతన దంపతులను ఆశీర్వదించారు. అనంతరం చంద్రబాబు అల్లు అరవింద్ నివాసానికి చేరుకొని శిరీష్-నయనిక దంపతులకు విషెస్ తెలిపారు. ఫొటోలను పైన గ్యాలరీలో చూడొచ్చు.
News March 14, 2026
కమల్ హాసన్‌పై చిన్మయి తీవ్ర విమర్శలు

తమిళ రచయిత వైరముత్తుకు జ్ఞానపీఠ్ అవార్డు రావడాన్ని అభినందిస్తూ ట్వీట్ చేసిన కమల్ హాసన్‌పై సింగర్ చిన్మయి మండిపడ్డారు. ‘ఈ వ్యక్తి పరిశ్రమలో గొప్ప వ్యక్తిగా ఉంటూ పాలిటిక్స్‌లోకి వచ్చారు. ఆయన అంకుల్(వైరముత్తు) లైంగికంగా వేధించాడని చెప్పినా వినిపించుకోవడం లేదు. ఇతను మన వైపు ఉండరని ఓటు వేసే మహిళలు గుర్తుంచుకోవాలి’ అని సూచించారు. కాగా గతంలో వైరముత్తు తనను వేధించాడని చిన్మయి తరచూ ఆరోపిస్తూ వస్తున్నారు.


